Begin typing your search above and press return to search.

చెన్నైస్టోరీలో కొత్త భామ ఈవిడేనా?

ఇలా వ‌రుస‌గా ఇద్ద‌రు భామ‌లు త‌ప్పుకోవ‌డంతో? ఏ కార‌ణంతో ఎగ్జిట్ అవుతున్నారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

By:  Tupaki Desk   |   11 April 2024 2:30 PM GMT
చెన్నైస్టోరీలో కొత్త భామ ఈవిడేనా?
X

హాలీవుడ్ చిత్రం 'చెన్నై స్టోరీ' నుంచి ఒక్కొక్క‌రుగా త‌ప్పుకుంటోన్న వైనం క‌నిపిస్తూనే ఉంది. తొలుత స‌మంత హీరోయిన్ గా ఎంపికైనా అమ్మ‌డు ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. అటుపై అదే పాత్ర‌కు శ్రుతిహాస‌న్ ఎంపికైంది. త్వ‌ర‌లోనే సెట్స్ కి వెళ్తానంటూ రివీల్ చేసింది. కానీ ఇంత‌లోనే ఆమె కూడా ఎగ్జిట్ అయింది. ఇలా వ‌రుస‌గా ఇద్ద‌రు భామ‌లు త‌ప్పుకోవ‌డంతో? ఏ కార‌ణంతో ఎగ్జిట్ అవుతున్నారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


డేట్లు స‌ర్దుబాటు కుద‌ర‌క త‌ప్పుకున్నారా? రొమాన్స్ అతిగా ఉంద‌నే కార‌ణంగా స్కిప్ కొట్టారా? అన్న‌ది తెలియ‌దు గానీ తాజాగా ఆ స్థానంలో బాలీవుడ్ న‌టి కియారా అద్వానీని ఎంపిక చేసిన‌ట్లు విశ్వస‌నీయ స‌మాచారం. ఇటీవ‌లే చిత్ర బృందం ముంబైలో కియారాని క‌లిసి స్టోరీ వినిపించారుట‌. క‌థ న‌చ్చ‌డంతో ఆమె ఒకే చెప్పిందిట‌. అయితే త‌న పాత్ర విష‌యంలో ఎలాంటి మార్పులు ఉండ‌కూడ‌ద‌ని..చెప్పింది చెప్పిన‌ట్లు తెర‌పై ఉండాల‌ని కండీష‌న్ పెట్టిందిట‌. అందుకు మేక‌ర్స్ అంగీక‌రించారుట‌. పాత్ర ప‌రంగా ఎలా న‌టించ‌డానికైనా తాను సిద్దంగా ఉన్నాన‌నే సంకేతాలు ఇచ్చిందిట‌.

దీంతో కియారా ఎంట్రీ దాదాపు ఖాయ‌మైన‌ట్లేన‌ని ముంబై వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా స్టోరీ విష‌యానికి వ‌స్తే త‌మిళ‌నాడు అమ్మాయి..అమెరికా అబ్బాయి మ‌ధ్య సాగే రొమాంటిక్ ల‌వ్ స్టోరీ ఇది. ఎన్ మురళి రాసిన పాపులర్ నవల `అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్` ఆధారంగా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫిలిప్ జాన్ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో వివేక్ కల్రా హీరోగా న‌టిస్తున్నాడు. హీరో-హీరోయిన్ మ‌ధ్య ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాలుంటాయ‌ని ముందే లీక్ అయింది.

మేక‌ర్స్ కండీష‌న్ కి స‌మంత అంగీక‌రించి త‌ర్వాత అడ్వాన్స్ కూడా ఇచ్చిన‌ట్లు అప్ప‌ట్లో తెర‌పైకి వ‌చ్చింది. హాలీవుడ్ టేస్ట్ కి త‌గ్గ‌ట్టు సినిమా ఉండాలంటే? హీరోయిన్ ఇంటిమేట్ స‌న్నివేశాల్లో త‌ప్ప‌క న‌టించాల్సిందే. అదేమి స‌మంత‌కి పెద్ద విష‌య‌మేం కాద‌నుకున్నారు. కానీ ఇటీవ‌ల స‌మంత వెర్ష‌న్ మారిన‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూ ద్వారా బ‌య‌టకు వ‌చ్చింది. ఆ త‌ర్వాత స‌మంత ఎగ్జిట్ అవ్వ‌డం జ‌రిగింది. మ‌రి ఆమె కోణంలో ఇదే కార‌ణ‌మా? అన్న‌ది తెలియాలి.