Begin typing your search above and press return to search.

ఫ్రెండు పెళ్లిలో చెర్రీ-ఉపాస‌న జంట హంగామా

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల ఇటీవల తమ ప్రియ స్నేహితురాలు రోస్మిన్ మాధవ్‌జీ వివాహ వేడుకలో పాల్గొనేందుకు పారిస్‌కు బయలుదేరారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 5:40 PM GMT
ఫ్రెండు పెళ్లిలో చెర్రీ-ఉపాస‌న జంట హంగామా
X

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల ఇటీవల తమ ప్రియ స్నేహితురాలు రోస్మిన్ మాధవ్‌జీ వివాహ వేడుకలో పాల్గొనేందుకు పారిస్‌కు బయలుదేరారు. ఈ జంట పెళ్లిలో అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో షోస్టాప‌ర్ గా నిలిచారు. చ‌ర‌ణ్ రొటీన్ కి భిన్నంగా ఆఫ్ లైన్ స్టైల్ తో పెళ్లిలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. అతను ఫరాజ్ మీనన్ రూపొందించిన అద్భుత‌మైన దుస్తుల‌ను ధరించాడు. అతడి వేషధారణ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ట్టుకుంది.


ఉపాసన ఒక రిచ్ బ్రౌన్ అనార్కలీ సూట్‌ను ధరించి బంగారు ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిపించింది. అంద‌మైన జంట‌ తమ స్నేహితులతో పోజులివ్వగా ఉపాసన తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఈ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. ఇక చెర్రీ-ఉపాస‌న దంప‌తులు త‌మ కుటుంబ వేడుక‌ల‌తో పాటు స్నేహితులు బంధుమిత్రుల పెళ్లి వేడుక‌ల‌ను మిస్ కారు. త‌ర‌చుగా ఈవెంట్ల‌లో సంద‌డి చేయ‌డం తెలిసిన‌దే.


చరణ్ ప్రస్తుతం తన కెరీర్ సహా వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన దశలో ఉన్నాడు. RRR చిత్రంతో అంత‌ర్జాతీయంగా చ‌రణ్ పాపుల‌ర‌య్యాడు. చ‌ర‌ణ్‌ భార్య ఉపాసన కొణిదెల ఇటీవలే మొదటి బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్‌ పాన్-ఇండియన్ స్టార్ డ‌మ్ విస్త‌రిస్తున్న వేళ ఇది అత‌డికి అద్భుత‌మైన గిఫ్ట్. చ‌ర‌ణ్ న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ మ‌రో పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రానికి సౌతిండియా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి జెర్సీ ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి, ప్ర‌శాంత్ నీల్ వంటి ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌నున్నాడు.