Begin typing your search above and press return to search.

పుష్ప 2, బహుబలిని దాటేసిన ఛావా.. టాప్ 5 రికార్డ్స్!

ఓ హిస్టారికల్ సినిమాకు అలా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోందంటే, కంటెంట్ మీద ఉన్న బలాన్ని అర్థం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   17 March 2025 3:11 PM IST
పుష్ప 2, బహుబలిని దాటేసిన ఛావా.. టాప్ 5 రికార్డ్స్!
X

ఛత్రపతి శంబాజీ మహరాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక విడుదలైనప్పటి నుంచి హాలిడేస్ వీకెండ్స్ లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్తున్న ఈ చిత్రం, లేటెస్ట్‌గా ఐదో వీకెండ్‌లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో లేటెస్ట్‌గా వచ్చిన సినిమాల్లో ‘ఛావా’కు తిరుగులేదని చెప్పొచ్చు.

ఓ హిస్టారికల్ సినిమాకు అలా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోందంటే, కంటెంట్ మీద ఉన్న బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా శంబాజి మహరాజ్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందించబడింది. అద్భుతమైన యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు, హీరో విక్కీ కౌశల్‌కి ఇదొక భారీ బ్రేక్‌గా మారింది. మౌత్ టాక్ బలంగా ఉండడంతో, రోజురోజుకూ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, ఐదో వీకెండ్‌లో మరో 22 కోట్లు జోడించుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

హిస్టారికల్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఎక్కువ కాలం రన్ అవుతాయి. ఇక ‘ఛావా’కి ఉన్న వేరియేషన్, గ్రిప్పింగ్ కథనంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఐదో వీకెండ్‌లో ‘ఛావా’ దూసుకుపోతుండగా, గతంలో ఇదే రికార్డును ‘పుష్ప 2’ తన పేరిట లిఖించుకుంది. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఐదో వీకెండ్‌లోనే 14 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌లో ‘పుష్ప’ ఒక రికార్డు గా నిలిచింది. అయితే ఇప్పుడు అదే రికార్డును ఛావా దాటేసింది.

ఇంకా బాహుబలి 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదో వీకెండ్‌లోనూ బాక్సాఫీస్‌ను అదరగొట్టిన సినిమాల్లో ఇది ఒకటి. ఈ మూవీ అప్పట్లో 8.5 కోట్ల వసూళ్లు సాధించి, ఇలాంటి రికార్డులు సాధించగలవని నిరూపించింది. రాజమౌళి విజన్, ప్రభాస్‌ నటన, గ్రాండ్ విజువల్స్ అన్ని కలిసి బాహుబలి 2ని ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. మరోవైపు ఇదే లిస్ట్‌లో ‘స్ట్రీ 2’ కూడా ఉంది. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఐదో వీకెండ్‌లో 16 కోట్ల వసూళ్లు సాధించి మంచి హిట్‌గా నిలిచింది. ఇదే బ్యానర్ నుంచి వచ్చిన ‘ఛావా’ ఇప్పుడు టాప్ పొజిషన్‌లో నిలవడం విశేషం.

మొత్తంగా చూస్తే, హిందీ మార్కెట్‌లో ఐదో వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు:

1. ఛావా - ₹22 కోట్లు

2. స్ట్రీ 2 - ₹16 కోట్లు

3. పుష్ప 2: ది రూల్ - ₹14 కోట్లు

4. యూరి - ₹12.50 కోట్లు

5. బాహుబలి 2 - ₹8.5 కోట్లు