Begin typing your search above and press return to search.

బ‌న్నీ వాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ ప‌ల్నాడు నాగ‌మ్మ‌!

మార్చి 7 నుంచి తెలుగు అనువాదంలోనూ అందుబాటులో ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 March 2025 7:42 PM IST
బ‌న్నీ వాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ ప‌ల్నాడు నాగ‌మ్మ‌!
X

పాన్ ఇండియాలో చారీత్రాత్మ‌క నేప‌థ్యం గ‌ల సినిమాలు ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన శంభాజీ మ‌హారాజ్ క‌థ `చావా`గా రూపొంది బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ముదులిపేసిన సంగ‌తి తెలిసిందే. వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మార్చి 7 నుంచి తెలుగు అనువాదంలోనూ అందుబాటులో ఉంటుంది.

తొలిసారి ఓ చారిత్రాత్మ‌క చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయండి అని పెద్ద ఎత్తున డిమాండ్ వ్య‌క్తం అయింది ఛావా కోస‌మే. అల్లు అర‌వింద్ కృషి వ‌ల్ల ఛావా తెలుగు రిలీజ్ సాధ్య‌మ‌వుతుంది. ఈసినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందిస్తున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆయ‌న ఎలాంటి వాయిస్ ఇవ్వ‌లేద‌ని...బిజీగా ఉన్న స్టార్ల‌ను ఇబ్బంది పెట్ట‌డం లేక ఎవ‌రి వాయిస్ తీసుకోలేద‌ని బ‌న్నీ వాస్ తెలిపారు.

డ‌బ్బింగ్ ఆర్టిస్టుల‌తోనే డ‌బ్బింగ్ చెప్పిస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అని అడిగితే ఆయ‌న ఇంట్రెస్టింగ్ చ‌రిత్ర గురించి మాట్లాడారు. ప‌ల్నాడు నాయ‌కురాలు నాగ‌మ్మ పైసినిమా చేయాల‌ని ఉంద‌ని తెలిపారు. 'ఎప్ప‌టి నుంచో ఈసినిమా తీయాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట పెట్టారు. ఇప్పుడున్న ట్రెండ్ లో చ‌రిత్ర నేప‌థ్యం గ‌ల సినిమాలు తీస్తే ఇండియాలో నే పెద్ద విజ‌యం సాధిస్తున్నాయ‌న్నారు.

మొత్తానికి ఇంత కాలం ల‌వ్ స్టోరీలు, యూత్ ఫుల్ సినిమాలే తీసిన బ‌న్నీ వాస్ కి కూడా చారీత్రాత్మ‌క సినిమా అంటే ఆస‌క్తి ఉంద‌ని ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి అర్ద‌మ‌వుతుంది. ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎప్పుడు మొద‌లు పెడ‌తారో చూడాలి. అలాగే జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు సంబంధించి ప‌బ్లిసిటీ, సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు త‌న‌కు అప్ప‌గించిన‌ట్లు తెలిపారు. అధికారంలోకి వ‌చ్చి న త‌ర్వాత తొలి ఆవిర్భావ స‌భ కావ‌డంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.