Begin typing your search above and press return to search.

ఛావా.. ఇంత లాభమొచ్చినా లీక్స్ దెబ్బ తప్పట్లే?

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఛావా మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Feb 2025 7:54 PM IST
ఛావా.. ఇంత లాభమొచ్చినా లీక్స్ దెబ్బ తప్పట్లే?
X

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఛావా మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత ఆధారంగా రూపొందిన ఆ మూవీ.. ఫిబ్రవరి 14న విడుదలై ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ సొంతం చేసుకుంది.

ముఖ్యంగా శంభాజీ మహారాజ్‌ గా విక్కీ యాక్టింగ్ ను కొనియాడని వారు లేరంటే డౌట్ అక్కర్లేదు. అయితే భారత్‌ లో ఇప్పటివరకు చావా రూ.353 కోట్లు (నెట్‌) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో మేకర్స్ తెలుగు వెర్షన్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చి 7వ తేదీన విడుదల చేయనున్నారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చావా మూవీ కోసం జోరుగా చర్చ సాగుతోంది. మూవీ సూపర్ హిట్ అయినా.. ఇటీవల 5.1 డాల్బీ అట్మాస్‌ తో చావా సినిమా 4K ప్రింట్ లీక్ కావడం వల్ల భారీ నష్టాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. పైరసీ చావా బాక్సాఫీస్ వసూళ్లను నేరుగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.

చాలా మంది ఆడియన్స్.. థియేటర్లకు వెళ్లకుండా పైరసీ వెర్షన్ ను చూసేస్తున్నారు. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాస్ అనే చెప్పాలి. అంతేకాకుండా చావాను కొనుగోలు చేసిన ఓటీటీ ప్లాట్‌ ఫామ్ కు కూడా నష్టమే. ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడే అనేక మంది డౌన్లోడ్ చేసి మొబైల్ లో చూస్తున్నారు.

దీంతో కచ్చితంగా వ్యూయర్స్ సంఖ్య తగ్గిపోతుంది. ఆదాయం కూడా 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పైరసీపై మరింత కఠినమైన నియంత్రణలు ఉండవలసిన అవసరాన్ని చావా మూవీ గుర్తు చేస్తుందని అంటున్నారు. పైరసీ వేలాది మంది ప్రజల శ్రమను, పెట్టుబడిని దెబ్బతీస్తుందని చెబుతున్నారు.

హ్యాకర్లు, పైరసీ నెట్‌ వర్క్‌ లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండడం వల్ల లీక్‌ లను ట్రాక్ చేయడానికి మేకర్స్.. స్ట్రాంగ్ ఎన్‌ క్రిప్షన్, వాటర్‌ మార్కింగ్ పద్ధతులను అవలంబించాలని కోరుతున్నారు. నేరస్థులను శిక్షించాలని అధికారులను కోరుతూ ఫిల్మ్ అసోసియేషన్లు, యాంటీ-పైరసీ సెల్‌ లు తక్షణ చర్య తీసుకోవాలని, లేకుంటే సినిమాలు మరిన్ని బలైపోతాయని చెబుతున్నారు. పైరసీకి వ్యతిరేకంగా పరిశ్రమ ఐక్యంగా ఉండాలని కోరుతున్నారు.