Begin typing your search above and press return to search.

చావా చరిత్రను వక్రీకరిస్తే మాత్రం..!

చరిత్ర కారులను చూపించే క్రమంలో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోమని చావా సినిమాను ముందే వారికి చూపించాలని ఫిక్స్ అయ్యారు.

By:  Tupaki Desk   |   25 Jan 2025 4:05 PM GMT
చావా చరిత్రను వక్రీకరిస్తే మాత్రం..!
X

విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలుగా హిస్టారికల్ మూవీగా వస్తున్న సినిమా చావా. ఈ సినిమా ఛత్రపతి శంభాజె మహారాజ్ జీవిత కథతో తెరకెక్కింది. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాల్లో ఎక్కడో ఒకచోట సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. చావా సినిమాలో అలాంటివి ఉంటే మాత్రం వారసుల నుంచి విమర్శలు తప్పవు. చావా సినిమా ట్రైలర్ చూస్తే శంభాజీ, యేసుబాయి లెజిమ్ అనే సంప్రదాయ సంగీత వాయిద్యాన్ని వాడినట్టు నృత్యం చేసినట్టు ఉంది. ఐతే అలా జరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలని రాజ్యసభ ఎంపీ శంబిరాజే ఛత్రపతి అన్నారు. చరిత్ర కారులను చూపించే క్రమంలో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోమని చావా సినిమాను ముందే వారికి చూపించాలని ఫిక్స్ అయ్యారు.

అంతేకాదు ఔరంగజేబు దుర్మార్గాలు కాస్త ఎక్కువ చూపించారనే చావా సినిమా ట్రైలర్ చూసిన కొందరు అంటున్నారు. ఐతే ఫైనల్ వెర్షన్ చూపిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో యేసుబాయ్ మహారాణి పాత్రలో రష్మిక నటించింది. ఈ సినిమా గురించి రష్మిక చెబుతూ ఇలాంటి పాత్రలు చేసి రిటైర్ అయిపోయినా పర్వాలేదని చెప్పింది. సో రష్మిక టాలెంట్ చూపించేలా మరో పాత్ర దక్కిందని చెప్పొచ్చు.

చావా సినిమా రిలీజ్ కు 3 వారాలు మాత్రమే ఉంది. సినిమా ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేస్తున్న మేకర్స్ సినిమా మీద ఎలాంటి నెగిటివిటీ లేకుండా చేయాలని చూస్తున్నారు. అందుకే ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా సినిమాను ముందే చూపించి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రష్మిక నటిస్తుంది కాబట్టి ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

హిస్టారికల్ సినిమాలు చేస్తున్న టైం లో జరిగిన విషయాన్ని ఇంకాస్త పెద్దది చేసి చెప్పడం సినీ దర్శకులకు అలవాటే. ఐతే అలాంటివే సినిమా మీద నెగిటివ్ ప్రచారానికి దారి తీస్తాయి. అంతేకాదు సినిమాలో మరీ వారి భావజాలానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం నిరసన సెగ కూడా తగులుతుంది. అందుకే చైత్ర కథగా తీసే సినిమాను వక్రీకరించకుండా తీయాలని సూచిస్తుంటారు.