'బాహుబలి-2' రికార్డ్ మళ్లీ బ్రేక్
బాహుబలి తెలుగులో రూపొందినప్పటికీ హిందీలో భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 హిందీ వర్షన్ లాంగ్ రన్‌లో రూ.510 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను ఛావా సినిమా క్రాస్ చేసింది.
By: Tupaki Desk | 11 March 2025 6:00 PM ISTవిక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొంది ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు కూడా వంద కోట్ల వసూళ్లు రాబడితే గొప్ప విషయం అన్నట్లుగా ఉంది. అలాంటి సమయంలో ఛావా సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.800 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇండియాలో ఛావా ఇప్పటి వరకు రూ.516 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. 25 రోజుల్లో ఈ భారీ మొత్తాన్ని రాబట్టడం కచ్చితంగా రికార్డ్ అని చెప్పుకోవాలి. దీంతో ఛావా సినిమా బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
బాహుబలి తెలుగులో రూపొందినప్పటికీ హిందీలో భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 హిందీ వర్షన్ లాంగ్ రన్‌లో రూ.510 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను ఛావా సినిమా క్రాస్ చేసింది. అంతకు ముందు పుష్ప 2 సినిమా సైతం హిందీ బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసిన విషయం తెల్సిందే. కేవలం హిందీ వర్షన్ పుష్ప 2 సినిమా దాదాపుగా రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో ఆల్ టైం రికార్డ్‌గా నిలిచింది. ఛావా సినిమా లాంగ్ రన్‌లో రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
ఇటీవలే ఛావా సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. మొదటి మూడు రోజుల్లో దాదాపు రూ.9 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత ఛావా తెలుగులో విడుదల కావడంతో కాస్త రెస్పాన్స్ తక్కువ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఆ విషయం పక్కన పెడితే హిందీ వర్షన్ భారీగా వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డ్‌లను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఛావా సినిమా నిర్మాతలకు ఇప్పటికే రెండింతల లాభాలు వచ్చాయంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఛావా ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఇంకా నాలుగు వారాల సమయం ఉంది. దాంతో సినిమా అన్ని భాషల్లోనూ కలిపి కచ్చితంగా రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు నార్త్ ఇండియాలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి సినిమాలు రావాలంటూ హిందూ సంఘాల వారు సైతం సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు. అంతే కాకుండా నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం విశేషం.