Begin typing your search above and press return to search.

తెలుగులో 'ఛావా' హవా.. అదిరిపోయిన ఓపెనింగ్స్!

తెలుగు ప్రేక్షకులకు చారిత్రక సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం. రాజులు, వీరులు, యుద్ధ గాథలు తెరపై కనిపిస్తే థియేటర్లలో మంచి ఆదరణ లభిస్తుంది.

By:  Tupaki Desk   |   8 March 2025 10:46 AM IST
తెలుగులో ఛావా హవా.. అదిరిపోయిన ఓపెనింగ్స్!
X

తెలుగు ప్రేక్షకులకు చారిత్రక సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం. రాజులు, వీరులు, యుద్ధ గాథలు తెరపై కనిపిస్తే థియేటర్లలో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించిన ‘ఛావా’ ఇప్పుడు తెలుగులోనూ అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు.

ఇక హిందీలో ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. అయితే తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మేరకే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 500కు పైగా థియేటర్లలో గీత ఆర్ట్స్ గ్రాండ్ గా విడుదల చేసింది. హిందీలోనే దాదాపు 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలయ్యింది.

ఇదివరకే కాంతర లాంటి కంటెంట్ ఉన్న సినిమాలను రిలీజ్ చేసిన గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం ద్వారా మరింత అంచనాలు పెరిగాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక విడుదలైన మొదటి రోజే 2.9 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. సాధారణంగా హిందీ డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ భారీ ఓపెనింగ్స్ రావడం అరుదు. కానీ ‘ఛావా’కి ముందు నుంచే పాజిటివ్ బజ్ ఉండడంతో ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఆదరించారు.

విభిన్నమైన కథ, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. తెలుగు వెర్షన్‌కి గీతా ఆర్ట్స్ క్వాలిటీ డబ్బింగ్‌ ఇవ్వడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ సినిమాలకు సాధారణంగా శబ్ద పరంగా కొంత అసౌకర్యం ఉండొచ్చు. కానీ ఈ సినిమాకు టాప్ లెవెల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో పని చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులు ఎలాంటి తేడా లేకుండా సహజంగా ఆస్వాదించగలుగుతున్నారు.

ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ డబ్బింగ్ పర్ఫెప్ట్ గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక కథ విషయానికి వస్తే, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది. పవర్‌ఫుల్ క్యారెక్టర్, యుద్ధ సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్స్ సినిమాకు బలమైన అడ్వాంటేజ్‌గా మారాయి. హిందీలో భారీ వసూళ్లు సాధించిన ‘ఛావా’ తెలుగులోనూ మంచి కలెక్షన్లు సాధించనుందనే అంచనాలు మొదటి రోజు నుంచే ఏర్పడ్డాయి.

ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, శని, ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించడంతో వీకెండ్‌లో రెవెన్యూ మరింత బలంగా ఉంటుందన్న విశ్వాసం పెరిగింది. గీతా ఆర్ట్స్ సరైన సమయంలో సరైన సినిమాను తెలుగులోకి తీసుకురావడంతో టాలీవుడ్ మార్కెట్ లో కాస్త హడావుడి నెలకొంది. ఇక ‘ఛావా’ తెలుగులో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.