Begin typing your search above and press return to search.

'ఛావా' తెలుగు రిలీజ్ తేడా కొట్టదుగా!

`ఛావా` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా 500 కోట్ల మార్క్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. శంభాజీ మ‌హారాజ్ పోరాటానికి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Feb 2025 9:30 AM GMT
ఛావా తెలుగు రిలీజ్ తేడా కొట్టదుగా!
X

`ఛావా` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా 500 కోట్ల మార్క్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. శంభాజీ మ‌హారాజ్ పోరాటానికి ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. హిందువులంతా మెచ్చిన గొప్ప చిత్రంగా నిలిచింది. నిజానికి ఈ సినిమా ఈ రేంజ్ లో హిందువుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌నుకోలేదు. ఈ స‌క్స‌స్ ఏమాత్రం ఊహించ‌న‌ది. సినిమాలో ప్ర‌తీ పాత్ర‌కు ప్రేక్ష‌కులు ఎంతో గొప్పగా క‌నెక్ట్ అవుతున్నారు.

ముఖ్యంగా విక్కీ కౌశ‌ల్, ర‌ష్మికా మంద‌న్నా, అక్ష‌య్ ఖ‌న్నా పెర్పార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో హైలైట్ అవుతుంది. సినిమాలో డైలాగులు ఓ రేంజ్ లో ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో చిత్రాన్ని తెలుగు లో రిలీజ్ చేయాల‌ని `ఛావా` హిందీ వెర్ష‌న్ రిలీజ్ అయిన నాటి నుంచి డిమాండ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద ఎత్తున తెలుగు అభిమానులు, హిందు వాదులంతా రీజ‌న‌ల్ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని అడుగుతున్నారు.

తెలుగు వెర్ష‌న్ విష‌యంలో అల్లు అర‌వింద్ ముందుకు రావ‌డంతో గీతా ఆర్స్ట్ సంస్థ‌లో ఎట్ట‌కేల‌కు రిలీజ్ అవుతుంది. మార్చి 7న తెలుగులో సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ రిలీజ్ అన్న‌ది చాలా ఆల‌స్యంగా జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా హిందీ లో రిలీజ్ అయింది. ఇప్ప‌టికే చాలా మంది ఆడియ‌న్స్ చూసేసారు. భాష‌తో సంబంధం లేకుండా ఆస్వాదించారు. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీస్ లో ఈ సినిమా హిందీ వెర్ష‌న్ అందుబాటులో ఉండ‌టంతో? దాదాపు ఆడియ‌న్స్ హిందీలోనే క‌వ‌ర్ చేసారు.

మారు మూల ప్రాంతాల‌కు, చిన్న పాటి ప‌ట్ట‌ణాల‌కు మాత్రం ఛావా ఇంకా చేర‌లేదు. ఆ బాధ్య‌త అర‌వింద్ తీసుకున్నారు. ఆ పంపిణీ సంస్థ నుంచి రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి చాలా సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ఈసినిమాకి అస‌లైన ఆద‌ర‌ణ ఇప్ప‌టి నుంచి మొద‌ల వుతుంది. చారీత్రాత్మక నేప‌థ్యం గ‌ల సినిమాల్ని ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఆడియ‌న్స్ బాగా ఆదరి స్తున్నారు.

`బాహుబ‌లి`తో రాజులు..రాజ్యాల క‌థ‌లు జ‌నాల‌కు అల‌వాటు అయింది. ఛావా కంటెంట్ కూడా ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. క‌థ‌లో ఎక్క‌డా ల్యాగ్ ఉండదు. కాబ‌ట్టి ఈ సినిమాకి తెలుగు వ‌సూళ్లు పెరుగుతాయి. అయితే ఇదే రిలీజ్ హిందీతో పాటు ఏక కాలంలో జ‌రిగి ఉంటే `ఛావా `ఇప్ప‌టికే 600 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించేది అన్న‌ది ట్రేండ్ అంచ‌నా.