ఛావా vs పుష్ప 2: మహారాష్ట్ర 11 రోజుల బాక్సాఫీస్ లెక్క ఎలా ఉందంటే?
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, మరాఠా గర్వం, శౌర్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది.
By: Tupaki Desk | 25 Feb 2025 6:53 AM GMTతెలుగు సినిమాల హవా నార్త్ లో ఎంతగా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు దక్షిణాది సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఆ కోవలోనే తాజాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంబాజి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన "ఛావా" సినిమా సంచలన వసూళ్లు సాధిస్తోంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, మరాఠా గర్వం, శౌర్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది.
మహారాష్ట్రలో ఈ సినిమా కలెక్షన్లు వేరే స్థాయిలో ఉన్నాయి. మొదటి 11 రోజుల్లోనే ఛావా సుమారు 186.05 కోట్ల నెట్ వసూలు చేసింది. గ్రేటర్ ముంబైలో 84.86 కోట్లు, బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్ లో 45% షేర్ సాధించగా, మిగతా మహారాష్ట్రలో 74.66 కోట్లు రాబట్టింది. విదర్భా ప్రాంతం నుంచి 14.50 కోట్లు, మరాఠ్వాడా నుంచి 12.03 కోట్లు వచ్చాయి. ఈ కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి.
ఇదే సమయంలో, టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2: ది రూల్" హిందీ వెర్షన్ కూడా నార్త్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 హిందీ వెర్షన్ 11 రోజుల్లో 144.33 కోట్ల నెట్ వసూలు చేసింది. అన్ని భాషల్లో కలిపి 148.61 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. గ్రేటర్ ముంబైలో హిందీ వెర్షన్ 65.91 కోట్లు, అన్ని భాషలు కలిపి 68.11 కోట్లు వసూలు చేసింది. అదే విధంగా, మిగతా మహారాష్ట్రలో పుష్ప 2 54.84 కోట్లు, విదర్భా నుంచి 15.64 కోట్లు, మరాఠ్వాడా నుంచి 10.02 కోట్లు వసూలు చేసింది.
ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, ఛావా కలెక్షన్లు పూర్తిగా మరాఠా ప్రాంతం నుంచి రావడం. పుష్ప 2 వసూళ్లు హిందీ బెల్ట్ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ బలంగా వచ్చాయి. కానీ మహారాష్ట్రలో మాత్రమే ఛావా దూకుడు పుష్ప 2 కన్నా ఎక్కువగా ఉండటం విశేషం. శంబాజి మహారాజ్ క్రేజ్, మరాఠా ప్రజల మనస్సుల్లో ఉన్న ఏమోషనల్ కనెక్షన్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
విక్కీ కౌశల్ నటన, రష్మిక మందన్నా క్రేజ్, అక్షయ్ ఖన్నా కీలక పాత్ర ఈ సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ముఖ్యంగా, విక్కీ కౌశల్ శంబాజిగా చూపించిన అద్భుతమైన అభినయం, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ప్రతి డైలాగ్ లోనూ, ప్రతి ఫైట్ సీన్ లోనూ మరాఠా గర్వం ఉట్టిపడుతోంది.
మొత్తంగా చూస్తే, బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 సత్తా గట్టిగానే ఉన్నా.. మహారాష్ట్రలో ఛావా ఆల్ టైమ్ బెస్ట్ కలెక్షన్స్ లో ఒకటిగా నిలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఛావా ఈ వారంలోనే మహారాష్ట్రలో 200 కోట్ల నెట్ వసూళ్లను అందుకోవడమే కాకుండా, దేశవ్యాప్తంగా 500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ ఈ సినిమా 360 కోట్లు దాటింది. శివరాత్రి కూడా కలిసి వస్తే సినిమా మరో రేంజ్ లో క్లిక్కయినట్లే.