Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్: మ‌రాఠా యోధుడ్నే త‌ల‌పించిన రీల్ హీరో!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీ కొచ్చిన విక్కీ కౌశ‌ల్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 8:13 AM GMT
టీజ‌ర్ టాక్: మ‌రాఠా యోధుడ్నే త‌ల‌పించిన  రీల్ హీరో!
X

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీ కొచ్చిన విక్కీ కౌశ‌ల్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వైవిథ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నాడు. ఓవైపు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు యూనిక్ కంటెంట్ తోనే ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నాడు. థియేట‌ర్ కి వెళ్లిన ఆడియ‌న్స్ కి త‌న సినిమాల‌తో ఓ కొత్త ఎక్స్ పీరియ‌న్స్ అందిస్తున్నాడు.

ఇటీవ‌లే `టోబా టోబా` పాట‌తో ఇంట‌ర్నెట్ నే షేక్ చేసాడు. ఈ ఒక్క పాట స్టెప్పుతో అత‌డి పాపులారిటీ అంత‌కంత‌కు రెట్టింపు అయింది. అలాగే `సామ్ బహదూర్` తో ఇటీవ‌ల మంచి విజ‌యం ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ క‌థ‌లోనూ న‌టిస్తున్నాడు. `ఛావా` టైటిల్ తో `డియ‌ర్ జింద‌గీ`, `ఇంగ్లీష్ వింగ్లీష్` చిత్రాల ఫేం ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తు న్నాడు.

ఇందులో విక్కీ కౌశ‌ల్ .. మొగల్ చక్రవర్తులను గడగడలాడించిన మ‌హారాష్ట్ర రాజు ఛత్రపతి శివాజీ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లోశివాజీ ఆహార్యంలో ఒదిగిపోయాడు. గ్లింప్స్ తోనే సినిమాపై పాజిటివ్ ఇంప్రెష‌న్ ప‌డింది. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే టీజ‌ర్ రిలీజ్ అయింది. ఛత్రపతి శివాజీ మ‌హారాజ్‌ను `సింహం` అని పిలుస్తారు అంటూ మొద‌లైన టీజ‌ర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

మోఘ‌ల్ సామ్రాజ్యంపై శివాజీ దండెత్తున తీరును టీజ‌ర్ లో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. చావా అంటూ శ‌త్రుసైన్యంపై శివాజీ తిరుగు బాటు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. వేలాది మంది సైన్యంపై వీరుడి పోరాటం ఎలా ఉంటుందో? ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. చుట్టూ వంద‌లాంది మంది సైన్యం చుట్టుముట్టినా? శివాజీ ఒంట‌రి పోరాటం ఎంతో ర‌క్తి క‌ట్టిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతే హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం టీజ‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 6న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ న‌టిస్తున్న `పుష్ప 2` కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. రెండు సినిమాల్లోనూ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మందాన్న క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌టం విశేషం.