ఛావా.. మన సినిమాలకు పూర్తి భిన్నం!
కానీ ఛావా మాత్రం అందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే చారిత్రక కథనంపైనే మొత్తం డిపెండ్ అయి ఉంది. సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి.
By: Tupaki Desk | 22 Feb 2025 3:42 AM GMTశంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఛావా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమా.. దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హృదయాలను హత్తుకుని అందరినీ మెప్పిస్తోంది.
ముఖ్యంగా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో హీరో విక్కీ కౌశల్ తన నటనకు ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్నారు. నేషనల్ క్రష్ రష్మిక హ్యాట్రిక్ హిట్ కొట్టి అందరి మెప్పు పొందుతున్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. పాజిటివ్ మౌత్ టాక్.. శరవేగంగా స్ప్రెడ్ అవుతోంది.
అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఎక్కువ వీఎఫ్ ఎక్స్ తో తెరకెక్కే భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే ప్రభావం చూపగలవని నమ్మే కొంతమంది టాలీవుడ్ నిర్మాతలను ఛావా మేల్కొల్పిందని కామెంట్లు పెడుతున్నారు. ఫైనల్ అవుట్‌పుట్ ప్రత్యేకంగా ఆకట్టుకోకపోయినా, తెలుగు చిత్రనిర్మాతలు కూడా తమ విజువల్ ఎఫెక్ట్‌ల గురించి గొప్పగా చెప్పుకుంటారని అంటున్నారు.
రీసెంట్ గా తెలుగు మేకర్స్ రూపొందించిన పలు పాన్ ఇండియా చిత్రాలు.. వీఎఫ్ ఎక్స్ పైనే ఎక్కువగా ఆధారపడ్డాయని చెబుతున్నారు. కానీ ఛావా మాత్రం అందుకు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే చారిత్రక కథనంపైనే మొత్తం డిపెండ్ అయి ఉంది. సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. వావ్ అనేలా వీఎఫ్ఎక్స్ ను వాడపోయినా.. మూవీని మాత్రం వావ్ అని అంతా అభినందిస్తున్నారు.
ముఖ్యంగా సినిమా చివరి 30-40 నిమిషాలు అయితే చెప్పనక్కర్లేదు. మూవీ హిట్ అవ్వడంలో అదే కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ కొనియాడకుండా ఉండలేరు. అంతలా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దారు. అయితే నిర్మాతలు ఈ చిత్రాన్ని బహుళ భాషలలో విడుదల చేయకూడదని ముందే డిసైడ్ అయ్యారేమో.
కానీ ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్ కోసం తెలుగు ప్రేక్షకుల నుంచి పెరుగుతున్న డిమాండ్ తో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరం. అదే సమయంలో ఎపిక్ పీరియాడికల్ డ్రామా మూవీస్ పై బాలీవుడ్ బాగా ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. అయితే సౌత్ కు కూడా వాటి పరిధిని విస్తరించాలి. అప్పుడే మరింత వసూళ్లు వస్తాయి. మరి ఛావా మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాలి.