Begin typing your search above and press return to search.

ఛావా.. ఆ ఒక్క నిర్ణయంతో డబ్బులే డబ్బులు!!

ఇప్పుడు ఛావా.. ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఫస్ట్ వీక్ లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Feb 2025 1:46 PM GMT
ఛావా.. ఆ ఒక్క నిర్ణయంతో డబ్బులే డబ్బులు!!
X

ఛావా.. ఛావా.. ఛావా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే చర్చ నడుస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కొడుకు శంభాజీ మహరాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఆ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్‌, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన్న నటించారు.

అదే సమయంలో శంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రలో అక్షయ్‌ ఖన్నా కనిపించారు. ఫిబ్రవరి 14వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఆ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వేరే లెవెల్ రెస్పాన్స్ ను అందుకుంటోంది. సినిమా అదిరిపోయిందని చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో చెబుతున్నారు.

ముఖ్యంగా విక్కీ కౌశల్ యాక్టింగ్ కు అంతా ఫిదా అవుతున్నారు. అద్భుతంగా యాక్ట్ చేశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. శంభాజీ మహరాజ్‌ చరిత్ర తెలుసుకున్నామని కొందరు చెబుతున్నారు. సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో చర్చ స్టార్ట్ అయింది.

ఛావా మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయం.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. అదేంటంటే.. రిలీజ్ వాయిదా వేయడం. నిజానికి గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అంతకు చాలా రోజుల ముందు.. పుష్ప-2 రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది.

దీంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. కానీ పుష్ప-2కి పోటీగా రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకుని వాయిదా వేశారు. రెండు సినిమాల కలెక్షన్స్‌ దెబ్బతినే అవకాశం ఉందని ఒక్క మెట్టు వెనక్కి దిగారు. సరైన డేట్ ను వెతుక్కుని ఇప్పుడు రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు మేకర్స్.

ఛావా మేకర్స్ తీసుకున్న నిర్ణయంతో రెండు సినిమాలు కూడా బాగా లాభపడ్డాయి. ఎందుకంటే.. పుష్ప-2 వరల్డ్ వైడ్ గా రూ.1850 కోట్లకు పైగా రాబట్టి.. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఛావా.. ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఫస్ట్ వీక్ లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఒక డిసెషన్ తో అటు పుష్ప.. ఇటు ఛావా ఫుల్ సేఫ్ అన్నమాట.