Begin typing your search above and press return to search.

'ఛావా' తో పోటీ పుష్ప‌కే ప్ర‌మాద‌మా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న `పుష్ప‌-2`పై పాన్ ఇండియాలో ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 5:38 AM GMT
ఛావా తో పోటీ పుష్ప‌కే ప్ర‌మాద‌మా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న `పుష్ప‌-2`పై పాన్ ఇండియాలో ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌త్యేకించి నార్త్ బెల్ట్ లో ఈసినిమాపై అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అన్న ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.తొలి భాగం ఎలాంటి అంచ‌నాలు లేకుండానే హిందీ బెల్ట్ లో కోట్ల రూపాయాలు వ‌సూళ్లు సాధించ‌డంతోనే రెండ‌వ భాగంపై అంచ‌నాలు పీక్స్ కి చేరాయి.

దేశ‌మంతా ఒకర‌క‌మై హైప్ ఉంటే? ఒక్క ఉత్త‌రాదిన రెట్టించిన హైప్ క‌నిపిస్తుంది. దీంతో రిలీజ్ ని కూడా నార్త్ మార్కెట్ ని కీల‌కంగా చేసుకురి రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ముందు అనుకున్న తేదీ ఆగ‌స్టు 15న రిలీజ్ అయితే ఇబ్బంది లేక‌పోయేది. కానీ ఇప్పుడా తేదీ నుంచి డిసెంబ‌ర్ 6కి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ తేదీది కూడా వ‌స్తుందా? మ‌రోసారి వాయిదా పడుతుందా? అన్న కొత్త సందేహాలు మొద‌ల‌య్యాయి.

అదే రోజున విక్కీ కౌశ‌ల్, ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోన్న ఛావా రిలీజ్ అవుతోంది. నిన్న‌టి టీజ‌ర్ లో కూడా రిలీజ్ తేదీని క‌న్ప‌మ్ చేసారు. టీజ‌ర్ ఏ రేంజ్ లో స‌క్సెస్ అయిందే తెలిసిందే. ఛావా టీజ‌ర్ కి నెట్టింట ఓ రేంజ్ లో రెస్పాన్స్ వ‌చ్చింది. ఛావా రిలీజ్ త‌ర్వాత విక్కీ కౌశ‌ల్ బ్రాండ్ ఇమేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవ్వ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తుంది. దీంతో సినిమాపై బ‌జ్ మ‌రింత పెరిగిపోతుంది. అదే రోజున కోలీవుడ్ నుంచి కూడా ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ కి ముస్తాబ‌వుతుంద‌నే కొత్త వార్త అందింది.

మ‌రి ఇలాంటి రెండు రిలీజ్ ల మ‌ధ్య `పుష్ప‌-2` రిలీజ్ క‌ష్ట‌మేనని కొంద‌రు బాలీవుడ్ నిర్మాత‌లు గెస్ చేస్తున్నారు. `పుష్ప‌-2`కి ఇది స‌రైన రిలీజ్ తేదీ కాద‌ని అంటున్నారు. వాయిదా ప‌డ‌టానికి అవ‌కాశాలు న్నాయ‌ని నిర్మాణ సంస్థ‌లు భావిస్తున్నాయి. 2025 వేస‌వికి రిలీజ్ చేసుకుంటే బాగుంటుంద‌నే సంకేతాలు స‌ద‌రు నిర్మాణ వ‌ర్గాల నుంచి పుష్ప‌-2కి వెళ్లిన‌ట్లు వినిపిస్తుంది. మ‌రేం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి. మొన్న‌టి వ‌ర‌కూ ప‌వన్ క‌ళ్యాణ్ తో రాజ‌కీయ లొల్లి కార‌ణంగా అభిమానుల నుంచి పుష్ప‌2కి థ్రెట్ ఉంటుంద‌నే వార్త వైర‌ల్ అయింది. ఇప్పుడేమో కొత్త సమ‌స్య తెర‌పైకి వ‌స్తోంది. ఏది ఏమైనా `పుష్ప‌-2`కి రిలీజ్ ముహూర్తం స‌రిగ్గా సెట్ అవ్వ‌న‌ట్లే క‌నిపిస్తుంది.