Begin typing your search above and press return to search.

మ‌రింత వ‌ణుకు పుట్టిస్తున్న ఛోరీ2 టీజ‌ర్

మ‌రీ ముఖ్యంగా చేత‌బ‌డుల నేప‌థ్యంలో వ‌చ్చే సినిమాల‌ను చూడ్డానికి ఆడియ‌న్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   26 March 2025 11:48 AM
Chhorii streaming on amazon prime video
X

హార్ర‌ర్ నేప‌థ్యంలో వ‌చ్చే సినిమాలు ఈ మ‌ధ్య ఆడియ‌న్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా చేత‌బ‌డుల నేప‌థ్యంలో వ‌చ్చే సినిమాల‌ను చూడ్డానికి ఆడియ‌న్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అందుకే ఓటీటీలు కూడా అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్‌ల‌ను నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాయి.

అందులో భాగంగానే నుస్ర‌త్ భ‌రూచా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ ఛోరీ2. బాలీవుడ్ న‌టి నుష్ర‌త్ భ‌రూచ టాలీవుడ్ ఆడియ‌న్స్ కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ హిందీ ఆడియ‌న్స్ కు మాత్రం నుష్ర‌త్ సుప‌రిచితురాలే. బాలీవుడ్ లో నుష్ర‌త్ ప‌లు సినిమాలు చేసింది. తెలుగు ఆడియ‌న్స్ కు నుష్ర‌త్ ను ప‌రిచ‌యం చేయాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చేసిన ఛ‌త్ర‌ప‌తి సినిమాలో హీరోయిన్ గా న‌టించిన అమ్మాయని చెప్పాలి.

సామాజిక దురాచారాల నుంచి, అతీంద్రియ శ‌క్తుల నుంచి కూతురిని కాపాడుకోవ‌డానికి ఓ తల్లి చేసే పోరాట కథ‌గా రిలీజైన ఛోరీ సినిమాకు ఇది సీక్వెల్ గా తెర‌కెక్కింది. ఛోరీ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకోవ‌డంతో దానికి సీక్వెల్ గా వ‌స్తోన్న ఛోరీ2 పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

విశాల్ ప్యూరియా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఛోరీ2పై హైప్ పెంచేందుకు దానికి సంబంధించిన టీజ‌ర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. టీజ‌ర్ చూస్తుంటే ఫ‌స్ట్ పార్ట్ కంటే మ‌రింత భ‌యంక‌రంగా ఉంది. మ‌రోసారి అదే స్థ‌లం, అదే ప్ర‌మాదం, అదే భ‌యం అనే మాట‌ల‌తో మొద‌లైన టీజ‌ర్ నీ కూతురు ఇప్పుడు నాది.. ఎప్ప‌టికీ నాదే అనే డైలాగ్స్ తో కొన‌సాగుతూ ఆద్యంతం ఆడియ‌న్స్ గుండెల్లో వ‌ణుకు పుట్టించింది. టీజ‌రే ఇంత భ‌యంక‌రంగా ఉంటే మ‌రి సినిమా ఇంకెంత భ‌యంకరంగా ఉంటుందో అని టీజ‌ర్ ను చూసి నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.