Begin typing your search above and press return to search.

గేమ్‌ ఛేంజర్‌ : మెగాస్టార్‌... పవర్‌ స్టార్‌ కన్ఫ్యూజన్‌!

అయితే ఆ ఈవెంట్‌కి గెస్ట్‌ ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 9:32 AM GMT
గేమ్‌ ఛేంజర్‌ : మెగాస్టార్‌... పవర్‌ స్టార్‌ కన్ఫ్యూజన్‌!
X

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం అమెరికాలో చేసిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మంచి స్పందన దక్కింది. భారీ ఎత్తున పబ్లిసిటీ దక్కిన ఈ సినిమా యొక్క భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 27న నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఈవెంట్‌కి గెస్ట్‌ ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ అవుతోంది.

గేమ్‌ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు ఇద్దరూ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం వేదిక పంచుకోబోతున్నారు అన్నారు. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఒక స్పష్టత అనేది రావడం లేదు. ఇంతకు మెగాస్టార్‌ ఈ వేడుకలో కనిపించబోతున్నారా లేదంటే అబ్బాయి కోసం బాబాయ్ వస్తారా అనేది చూడాలి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌ కళ్యాణ్ గేమ్‌ ఛేంజర్‌ కి వస్తే కచ్చితంగా అదనపు ఆకర్షణ అనడంలో సందేహం లేదు.

పొలిటికల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే విధంగా దిల్‌ రాజు తన ప్లాన్‌ రెడీ చేశారు. ఇతర సంక్రాంతి సినిమాలతో పోల్చితే దాదాపు డబుల్‌ థియేటర్లను ఈ సినిమా కోసం దిల్ రాజు రెడీ చేశాడు. ముఖ్యంగా మొదటి రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 80 నుంచి 90 శాతం థియేటర్‌లను బుక్‌ చేశారని తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమా కోసం ఎక్కువ థియేటర్‌లను ఇవ్వాలని దిల్‌ రాజు వద్దకు కొందరు వచ్చారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏది ఏమైనా గేమ్‌ ఛేంజర్‌ సినిమా అత్యధిక స్క్రీన్స్‌ లో విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇండియన్ 2 సినిమా నిరాశ పరచినా శంకర్‌ సినిమా అనగానే తమిళ ఆడియన్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను ఆయన రూపొందించారు. ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను శంకర్‌కు ఇవ్వడం జరిగింది. ఆయన ఇష్టపడి ఈ సినిమాను రూపొందించారు. దర్శకుడు శంకర్‌ వింటేజ్ సినిమాల మాదిరిగా గేమ్‌ ఛేంజర్ ఉండబోతుంది. చరణ్ డ్యూయల్‌ రోల్‌లో కనిపించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా అంజలి, కియారా అద్వానీలు నటించారు. శ్రీకాంత్‌, ఎస్‌ జే సూర్య ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.