Begin typing your search above and press return to search.

చైనాలో పెళ్లిళ్లు లేవ్ ఓన్లీ విడాకులే.. మ‌రి భార‌త్‌లో?

దీంతో అక్క‌డ ఆర్థిక ప‌రిస్థితి కూడా అల్ల‌క‌ల్లోలంగా మారుతోంద‌నేది తాజా స‌ర్వే.

By:  Tupaki Desk   |   11 Feb 2025 12:30 AM GMT
చైనాలో పెళ్లిళ్లు లేవ్ ఓన్లీ విడాకులే.. మ‌రి భార‌త్‌లో?
X

చైనా దేశంలో సంతానోత్ప‌త్తి ప‌డిపోయింది. అక్క‌డ పెళ్లిళ్లు లేవ్. వివాహ వ్య‌వ‌స్థ ఢ‌మాల్. అక్క‌డ పెళ్లిళ్ల‌ కంటే విడాకులే ఎక్కువ‌య్యాయి. ఇటీవ‌ల చైనాలో సామాజిక‌ ప‌రిణామాలు ప‌రిశీలిస్తే సీన్ సితారైపోతోంద‌ని తేలింది. చైనాలో అస‌లు పెళ్లిళ్లు లేవ్. విడాకులు దారుణంగా భ‌య‌పెట్టేంత‌గా పెరిగాయి. దీంతో అక్క‌డ ఆర్థిక ప‌రిస్థితి కూడా అల్ల‌క‌ల్లోలంగా మారుతోంద‌నేది తాజా స‌ర్వే.

చైనా వైవాహిక వ్య‌వ‌స్థ ఇప్పుడు పూర్తిగా కొలాప్స్ అయింది. గత సంవత్సరం వివాహాలలో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది. ఆ దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివాహ నమోదులలో 20 శాతం తగ్గుదల నమోదైందని, గత సంవత్సరం 7.68 మిలియన్లు ఉండ‌గా, ఇప్పుడు 6.1 మిలియన్ల జంటలు మాత్రమే వివాహం చేసుకున్నారని క‌థ‌నాలొచ్చాయి. పెళ్లిళ్లు త‌గ్గుద‌ల చూస్తుంటే అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక‌ప్పుడు ఒకే బిడ్డ ముద్దు అన్న‌వాళ్లే, దేశంలో ఇప్పుడు వివాహం, పిల్లలను కనడాన్ని చురుకుగా ప్రోత్సహిస్తున్నారు.

విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త ప్ర‌కారం.. 2020లో కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కూడా వివాహాలు 12.2శాతం మాత్రమే తగ్గాయని, గత సంవత్సరం చైనాలో వివాహాల సంఖ్య 2013లో నమోదైన 13.47 మిలియన్లలో సగం కంటే తక్కువగా ఉందని గుర్తించారు. ఈ ధోరణి కొనసాగితే చైనా ఆర్థికంగా చితికిపోతుంది. రాజ‌కీయంగా వెన‌క‌బ‌డిపోతుంద‌ని భ‌య‌ప‌డుతున్న‌ట్టు నివేదిక వెల్ల‌డించింది.

చైనాలో విడాకులకు వెళ్లేవారి సంఖ్య‌ పెరుగుదలను కూడా ఈ డేటా వెల్లడించింది. గత సంవత్సరం 2.6 మిలియన్లకు పైగా జంటలు విడాకులు తీసుకున్నారు. ఇది 2023 నుండి 1.1శాతం పెరుగుదలను న‌మోదు చేసింది. చైనా తన జనాభా సవాళ్లతో పోరాడుతున్నందున, యువతరంలో వివాహం, పిల్లలను కనడం, కుటుంబ విలువలను ప్రోత్సహించడంలో అధికారులు తీవ్ర పోరాటాలు సాగిస్తున్నారు.