Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్ కేసు విషయంలో చిన్మయి మరో కామెంట్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలోనే కాకుండా సమాజంలో కూడా మహిళలు ఎదుర్కొనే వేధింపుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 12:48 PM GMT
జానీ మాస్టర్ కేసు విషయంలో చిన్మయి మరో కామెంట్
X

ఆడవాళ్ళపై వేధింపులు ఎప్పటి నుంచో ఉన్నాయని.. అయితే మీటూ వచ్చిన తర్వాత చాలా మంది తాము ఎదుర్కొన్న వేధింపులపై బయటకొచ్చి మాట్లాడటం మొదలెట్టారని చిన్మయి చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలోనే కాకుండా సమాజంలో కూడా మహిళలు ఎదుర్కొనే వేధింపుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అన్ని చోట్ల ఆడవాళ్ళపై వేధింపులు ఉన్నాయని అన్నారు. జానీ మాస్టర్ కేసు గురించి ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినపుడు చిన్మయి ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీనేజ్ లో ఎదురయ్యే ఇబ్బందులు చెప్పడానికి కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. అయితే ఒక వయస్సు పెరిగే కొద్ది ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. దానికి తగ్గట్లుగానే ఫేస్ చేసే ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతూ ఉంటాం. అలాగే జానీ మాస్టర్ ఇష్యూలో కూడా ఆమె రియాక్ట్ అయ్యి ఉండొచ్చని చిన్మయి చెప్పుకొచ్చారు.

తాను ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పినపుడు ఏ ఒక్కరు నాకు సపోర్ట్ చేయలేదు. అలా బయటకి చెప్పినందుకు అవకాశాలు లేకుండా చేశారు. కొంతమంది ఫోన్ చేసి సలహాలు ఇచ్చారని అన్నారు. ఆడవాళ్ళపై వేధింపులు అన్ని రంగాలలో ఉన్నాయి. చాలా మంది వేధింపులకి గురయ్యే వారు ఉన్నారు. పెద్ద పెద్ద వారు కూడా ఆడవాళ్ళని వేధించిన కేసులు ఉన్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది అందరికి ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుందని ఆమె తెలిపారు. మీటూ అనేది కలెక్టివ్ ఫైట్. ఇందులో అన్ని రంగాలలో వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఉన్నారని చిన్మయి చెప్పారు .

సమాజంలో జరుగుతున్న సంఘటనల పైన, ఆడవారిపై జరిగే వేధింపుల మీద రియాక్ట్ అయితే సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ట్రోల్ చేస్తారు. ఇంట్లో భర్తకి వంటచేసుకోమని సలహా ఇస్తారు. అయితే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ నా భర్త. రాహుల్ లాంటి హస్బెండ్ ఉండబట్టి నేను ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతున్నాను. నేనెంటో రాహుల్ కి తెలుసు.

నేను ఏం మాట్లాడిన దానిని అర్ధం చేసుకుంటాడు. ఇప్పటికి సొసైటీలో ఆడవాళ్ళపై అన్ని రకాలుగా వేధింపులు ఉన్నాయి. మహిళలు కూడా వాటిని భరిస్తున్నారు. సొసైటీలో జరిగే మేజర్ క్రైమ్స్ లలో ఆడవాళ్లు బాధితులుగా ఉన్నారు. ఫెమినిజం అంటే మహిళలకి అన్ని విషయాలలో రైట్స్ కోసం ఫైట్ చేయడం. అలాంటి వాటిపై నేను ఫైట్ చేస్తూ ఉంటాను అని ఇంటర్వ్యూలో చిన్మయి శ్రీపాద వివరణ ఇచ్చారు.