కొండా సురేఖ వ్యాఖ్యలపై చిన్మయి రియాక్షన్!
దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి.
By: Tupaki Desk | 2 Oct 2024 2:39 PM GMTనాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలిప్పుడు తీవ్ర దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు. `రాజకీయా లకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్ధులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి.
బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను` ట్వీట్ చేశారు. ఆమె వ్యాఖ్యలపై నెటి జనులు, అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. ఓమహిళ ఇలాంటి వ్యాఖ్యలు ఆమె ఎలా చేసారంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సమంత స్నేహితురాలు, గాయని చిన్మయి కూడా సురేఖ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించింది. కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారు. సమంత విషయంలో యూట్యూబ్ ఛానెళ్లు, మీడియా సంస్థల తీరును ఆమె తప్పు బట్టింది. వ్యూస్ , లైకుల కోసం ఇలా చేయడం చాలా బాధాకరం. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టారీతున మాట్లాడటం తగదు` అని అసహంన వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇంకా చాలా మంది స్పందించే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. రాజకీయాలకు- సినిమాలకు సంబంధం లేనే లేదు. కానీ సినిమా-రాజకీయాన్ని ముడి పెట్టి మాట్లాడటం ఏమాత్రం సహేతుకంగా లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.