6 వేల అడుగుల లోతులో పాతిపెట్టారు.. గాయకుడి లిప్‌లాక్ ఇష్యూపై చిన్మయి!!
ఆ ముద్దు గురించి ప్రస్థావించకుండానే, సీనియర్ గాయకుడు తమకంగా లిప్ లాక్ వేసాడని విమర్శిస్తున్నారు.
By: Tupaki Desk | 4 Feb 2025 6:30 PM GMTఒకానొక లైవ్ కాన్సెర్ట్ లో అభిమాని తన బుగ్గపై ముద్దు ఇచ్చిన క్రమంలో తన్మయం చెందిన ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ఆమె పెదవులపై ఆత్మీయంగా ముద్దు పెట్టుకున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిని ఒక్కొక్కరూ ఒక్కోలా రిసీవ్ చేసుకుంటున్నారు.. చాలా మంది ఉదిత్ నారాయణన్ టెంప్టింగ్ లిప్ కిస్ కి అవాక్కయ్యారు. అయితే అంతకుముందు ఆ అభిమాని కొంటెగా, ప్రేమగా అతడి బుగ్గపై ముద్దు పెట్టడాన్ని ఎవరూ గమనించలేదు. ఆ ముద్దు గురించి ప్రస్థావించకుండానే, సీనియర్ గాయకుడు తమకంగా లిప్ లాక్ వేసాడని విమర్శిస్తున్నారు.
ఏది ఏమైనా అమ్మాయి ముద్దు చేదు గుళిక వంటిదని ఈ సీనియర్ గాయకుడికి అర్థమైంది. అతడు తనను సమర్థించుకున్నా కానీ, తనపై ఎవరో కావాలని బురద జల్లుతున్నారని ఆవేదన చెందినా కానీ, చివరిగా తప్పు అనిపిస్తే సారీ అని అన్నారు. ఈ వివాదంపై ఇప్పుడు చిన్మయి స్పందించింది. ఉదిత్ నారాయణ్ ఒక మహిళ పెదవిపై ముద్దు పెట్టుకున్నందుకు నెటిజనులు స్పృహ కోల్పోతున్నారు.. కానీ అను మాలిక్, వైరముత్తు, కార్తీక్ సహా ఎందరో వేధింపులకు పాల్పడినా వారికి ప్రజలు అండగా నిలిచారు.
ఇలాంటివి ద్వంద్వ ప్రమాణాలు మాత్రమే కాదు... అంతకుమించినవి. ఆ ప్రమాణాలన్నీ 6000 అడుగుల భూగర్భంలో పాతిపెట్టారు.. అని ఘాటుగా విమర్శించారు. చిన్మయి తన ఆరోపణల సమయంలో ప్రజలు మద్ధతు ఇవ్వలేదని ఆవేదన చెందారు. కేవలం ఒక గాయకుడి విషయంలో ఇంతగా రియాక్టయిన వారు ఎవరూ తనకు ఆ సమయంలో అండగా నిలవకపోవడాన్ని నిలదీసారు.