ఇలాంటి దేశంలో పుట్టడం మన ఖర్మ! చిన్మయి
ఇదే సమయంలో ఆమె వ్యాఖ్యలకు రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ గాయని చిన్మయి శ్రీపాద తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 26 Feb 2024 11:55 AM GMTసీనియర్ నటి అన్నపూర్ణ మహిళల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో అన్నపూర్ణ పాత రోజుల్లో మహిళలు బయటకు వచ్చేవారా? మహిళలకు ఎందుకు స్వాత్రత్యం కావాలి? అర్ధరాత్రి 12 గంటల తర్వాత బయట పనేంటి? ఆడవాళ్ల ఎక్స్ పోజింగ్ అలా ఉంది? అలాంటప్పుడు దాడులు ఎందుకు జరగవు? ఎప్పుడు ఎదుటవారిని తప్పు అనకూడదు? మనం కూడా ఆలోచించాలి? కదా అని మహిళల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో ఆమె వ్యాఖ్యలకు రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ గాయని చిన్మయి శ్రీపాద తన అసహనాన్ని వ్యక్తం చేసింది. మరో వీడియోలో చిన్మయి...అన్నపూర్ణ వ్యాఖ్యలపై మండిపడింది. 'అన్నపూర్ణమ గారి నటన అంటే ఇంతో ఇష్టం. అభిమాన నటిగా భావిస్తాను. కానీ అలాటి నటి మహిళల స్వాతంత్య్రం గురించి అలా మాట్లాడుతుంటే గుండె బద్దలవుతుంది. ఆమె ఉద్దేశంలో రాత్రివేళ మెడికల్ ఎమర్జెన్సీ లో మహిళా డాక్టర్లు. నర్సులు ఉండకూడదు.
మహిళలు ఏ పని అయినా ఉదయం నుంచి సాయంత్రలోపే ముగించుకోవాలి. ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆసుపత్రిలో ఉండాలి. ఈవిడ రూల్ ప్రకారం పిల్లలు కూడా అదే సమయంలో పుట్టాలి. ఇంకా గ్రామాల్లో ఆరుబయట ప్రదేశాలకు వెళ్లే మహిళలు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయిలు పొట్టి డ్రెస్ లు చేసుకోవడం మానేయాలి. జుట్టు జడ వేసుకోవాలి? ఓపెన్ గా వదిలేయకూడదు. బాత్రూమ్ సౌకర్యం లేని గ్రామాల్లో మహిళలు తెల్లవారు జామున పోలాలవైపు వెళ్తే అఘాయిత్యాలకు పాల్పడే మగవాళ్లు ఉన్న సొసైటీ ఇది.
వీరి మాటలు వారికే మద్దతిచ్చేలా ఉన్నాయి. ఇలాంటి దేశంలో పుట్టడం మన ఖర్మ ' అంటూ చిన్మయి అసహనం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటి జనులు చిన్మయి పై మండిపడుతున్నారు. అన్నపూర్ణ అర్ధరాత్రి 12 గంటల సమయంలో బయట తిరిగే మహిళల్ని ఉద్దేశించి మాట్లాడితే చిన్మయి ఆ మాటల్ని వక్రీకరించి...తప్పుడు అర్దం వచ్చేలా మాట్లాడు తుందని మండిపడుతున్నారు. చిన్మయి వ్యాఖ్యల్ని మహిళలు కూడా తీవ్రంగా ఖండిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.