Begin typing your search above and press return to search.

కూతురిని తండ్రి హగ్ చేసుకోవడం కూడా తప్పేనా?.. సింగర్ పై నెటిజన్స్ ఫైర్!

సింగ‌ర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రేక్షకులకు ప్ర‌త్యేక పరిచయాలు అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   30 July 2024 6:47 AM GMT
కూతురిని తండ్రి హగ్ చేసుకోవడం కూడా తప్పేనా?.. సింగర్ పై నెటిజన్స్ ఫైర్!
X

సింగ‌ర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రేక్షకులకు ప్ర‌త్యేక పరిచయాలు అవ‌స‌రం లేదు. గాయనిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంత పేరు తెచ్చుకుందో.. వివాదాలతోనూ అంతే పాపులారిటీ సంపాదించుకుంది. ‘మీ టూ’ ఉద్యమ సమయంలో సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాల గురించి మాట్లాడి సంచలనం రేపింది. తరచుగా సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న లైంగిక వేదింఫులు.. స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలపై సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతూ ఉంటుంది. అయితే తాజాగా చిన్మయి పెట్టిన ఓ పోస్టుపై నెట్టింట పెద్ద దుమారం రేగుతోంది.

హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌ ను చిన్మయి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కవల పిల్లలు ఉన్నారు. కూతురికి ఇష్టం లేదని తన భర్త రాహుల్ కౌగిలించుకోవడమే మానేసినట్లు చిన్మయి సోషల్ మీడియాలో తెలిపింది. "కొన్ని రోజుల క్రితం రెండేళ్ల నా కూతురుని రాహుల్ హగ్ చేసుకోబోతే తను నో చెప్పింది. దీంతో రాహుల్ 'నన్ను కౌగిలించుకోమని నిన్ను బలవంతపెట్టను దృప్తా.. కానీ నీకు తెలుసు కదా మీ నాన్నకు నువ్వు అంటే చాలా ఇష్టం' అని తనకు చెప్పాడు. మళ్లీ తనను హగ్ చేసుకోడానికి రాహుల్ ప్రయత్నించలేదు. ఒక పెద్ద వ్యక్తిగా నేనూ ఇదే పాటిస్తాను. అమ్మాయి అయినా సరే ఆరేడేళ్ల వయసున్న పాపను నీ బుగ్గను గిల్లడానికి పర్మిషన్ అడుగుతాను. తనను ముట్టుకోవడానికి ముందే తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటాను" అని చిన్మయి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొంది.

చిన్మయి పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తండ్రి కూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూస్తుందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు నేర్పించడంలో తప్పు లేదు కానీ, తండ్రి కౌగిలింతను కూడా తప్పనే విధంగా కరెక్ట్ కాదని కామెంట్లు చేశారు. 'మా కూతురు' అనకుండా 'నా కూతురు' అనడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై చిన్మయి రియాక్ట్ అవుతూ.. ఎంతో కష్టమైన ప్రసవ ప్రక్రియలో ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి 'నా కూతురు' అని అనకూడదు.. 'నా బిడ్డ' అని ఈ సమాజంలో ఏ కన్న తల్లి కూడా చెప్పకూడదు అని వ్యాఖ్యానించింది. నేను ఇలా మాట్లాడితే తెలుగు ట్విట్టర్ ప్రజలు నాకు ఫెమినిస్ట్, సూడో ఫెమినిస్ట్ సర్టిఫికెట్లు ఇస్తారు. విక్టిమ్ కార్డ్ ప్లేయర్అ వార్డులను అందజేస్తారు అని పోస్ట్ పెట్టింది. ఇదే క్రమంలో ట్రోలర్స్‌కి వార్నింగ్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేసింది.

చిన్మయి మాట్లాడుతూ.. "తండ్రీ కూతుళ్ల బంధం చాలా పవిత్రమైనది.. దాంట్లో కూడా మీరు సమస్యలు వెతుకుతున్నారంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. కానీ నేను రాహుల్‌ కి ఇలా చేయమని చెప్పలేదు. తనంతట తానుగా చేసిన పని. నా కూతురితో రాహుల్ అలా చెప్పిన తర్వాత చాలా మెచ్చుకున్నాను.. దాని వల్ల తనపై ఉన్న గౌరవం ఇంకా పెరిగింది. అయినా ఈ తెలుగు మీమ్, ట్రోల్ పేజీలు ఎప్పుడూ రాహుల్ నాతో ఎలా బతుకుతున్నాడు.. సఫర్ అవుతున్నాడు. టార్చర్ అనుభవిస్తున్నాడు.. దీన్ని వదిలేసి వెళ్లిపో మావా.. డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపో అంటూ ఎప్పుడూ వాగుతూ, అరుస్తూ ఉంటాయి. పాపం వాళ్ళ ఫ్యామిలీలో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు కానీ, మేమిద్దరం పెళ్లయిన దగ్గరి నుంచి చాలా హ్యాపీగా ఉంటున్నాం. ఒకవేళ నాతో ఎవరైనా ఉండలేకపోతున్నారని నాకు అనిపిస్తే మొదట నేనే దూరంగా వెళ్లిపోతా. ఇక రాహుల్ విషయానికొస్తే అతను గొప్ప ఆల్ఫా మేల్.. మీలాంటి టాక్సిక్ షిట్ కాదు" అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది.

చిన్మయి వీడియోపై ఆమె స్నేహితురాలు, స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్పందించింది. "ఇది రాహుల్ ఖచ్చితంగా చేసే పని" అని కామెంట్ పెట్టింది. ఏదేమైనా చిన్మయి తన భర్త కుమార్తె గురించి పెట్టిన పోస్టు విషయంలో కొందరు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.