ఫీమేల్ హోస్ట్ పిల్లాడి ముద్దుపై చిన్మయి రియాక్షన్!
గాయని చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 28 July 2024 10:22 AM GMTగాయని చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలు, చిన్నారులపై జరిగే దాడులపై నిత్యం యుద్దం చేస్తూనే ఉంటుంది. ప్రపంచంలో మహిళలపై ఎలాంటి లైంగిక దాడి జరిగినా న్యాయం కోసం ప్రశ్నించడం ఆమె నైజం. సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని బలంగా వినిపిస్తుంది. `మీటూ ఉద్యమం` సమయంలో ఎంతో మంది మహిళల తరుపున పోరాటం చేసింది.
ఇటీవలే నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసాడని ఆరోపించింది. దానికి సంబంధించిన కొన్నిఆధారాలు సైతం చూపించింది. తాజాగా చిన్మయి మరో పోస్ట్ చేసింది. ఓ టీవీషోలో లేడీ హోస్ట్ చేసిన పనిపై మండిపడింది. `ఓ టీవీ షోలో ఓ ఫీమేల్ హోస్ట్ ఒక చిన్నపిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూసాను. అది చూసి అక్కడ ఆడియన్స్‌తో పాటు అంతా నవ్వుకున్నారు. అంతేకాదు ముద్దు ఇవ్వమని పిల్లాడిని..తీసుకోమని యాంకర్ని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇలాంటివి చేయడం వల్ల ఆ కుర్రాడిపై దుష్ప్రభావం పడుతుంది. బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి క్లాస్ చెబితే ఏది తప్పు? ఏది రైట్ అన్నది తెలియక గందరగోళానికి గురవుతాడు. టీవీల్లో ప్రసారమయ్యే ఇలాంటి షోలు చిన్నారుల భద్రతకు ఏ మాత్రం పనికిరావు. సమాజం కూడా ఇలాంటి వాటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. ఏదో సరదాకి చేద్దాం అని చేసినా అది నెగిటివ్ గా జనాల్లోకి వెళ్తుంది. దయచేసి అంతా దీన్ని గుర్తించండి` అని రాసుకొచ్చింది.
అయితే చిన్మయి ఏ లేడీ హోస్ట్ ని ఉద్దేశించి ఇలా స్పందించింది అన్నది చెప్పలేదు. గతంలో యాంకర్ అనసూయ ఓ పిల్లాడితో ఇలాగే లిప్ కిస్ చేయించుకుంది. ఆమెని ఉద్దేశించి చిన్మయి ఇలా రియాక్ట్ అయిందా? అని నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆమె పేరు చెప్పలేదు కాబట్టి అనసూయ ప్రస్తావన అనవసరమైనదే.