Begin typing your search above and press return to search.

'చిన్న కథ'తో రానా దగ్గుబాటి.. ఈయన కూడా అప్పుడే రాక..

తాజాగా కొత్త మూవీ అనౌన్స్ చేశారు. 35-చిన్న కథ కాదు అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. ప్రియదర్శి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 9:23 AM GMT
చిన్న కథతో రానా దగ్గుబాటి.. ఈయన కూడా అప్పుడే రాక..
X

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి.. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాలు నిర్మించిన రానా.. తాజాగా కొత్త మూవీ అనౌన్స్ చేశారు. 35-చిన్న కథ కాదు అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. ప్రియదర్శి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో టైటిల్ పోస్టర్ ను కూడా రానా షేర్ చేశారు.

పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ సినిమా కథ జరగనున్నట్లు అనౌన్స్ చేశారు రానా. అందరి హృదయాలను హత్తుకునే స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో గుడి మెట్లపై కూర్చున్న ఓ కుటుంబం మాట్లాడుకుంటూ కనిపిస్తోంది. పోస్టర్ బట్టి చూస్తుంటే.. తిరుపతికి చెందిన ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్లు రానా ట్వీట్ ద్వారా అర్థమవుతోంది.

అయితే మూవీ అనౌన్స్మెంటే కాదు.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అనేక సినిమాలు ఆ రోజు రిలీజ్ కానుండగా.. పెద్ద క్లాషే జరగనున్నట్లు కనిపిస్తోంది. క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ను తమ సినిమా అలరిస్తుందనే నమ్మకంతో 35-చిన్న కథ కాదు మేకర్స్ ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

ఇక ఈ సినిమా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. కమెడియన్ నుంచి హీరోగా మారిన ప్రియదర్శి.. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నివేదా థామస్.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో సందడి చేయనుంది. విశ్వ దేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికి తదితర చిత్రాలకు వర్క్ చేసిన వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆకాశం నీ హద్దు రాతోపాటు పలు సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న నికేత్ బొమ్మి ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. టీసీ ప్రసన్న ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ప్రముఖ సురేష్ ప్రొడక్షన్స్‌ తోపాటు ఎస్ ఒరిజినల్స్, వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ అరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.