మెగా ప్రాజెక్ట్ కోసం అనీల్ రావిపూడి వాయు వేగంతో!
తాజాగా మెగాస్టార్ ప్రాజెక్ట్ విషయంలోనే అనీల్ అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారుట.
By: Tupaki Desk | 18 Feb 2025 1:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. వేసవిలో సినిమా మొదలవుతుందని ఇప్పటికే చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. ఈ నేపథ్యంలో అనీల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతం చేసాడు. చిరంజీవి `విశ్వంభర` షూటింగ్ కూడా క్లైమాక్స్ కి రావడంతో? వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని అనీల్ రేయింబవళ్లు ఇదే ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాడు.
దీనిలో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభమ య్యాయి. భీమ్స్ నాలుగు పాటలకు సంబంధించి కంపోజింగ్ కూడా పూర్తి చేసాడని సమాచారం. అటు నటీనటుల ఎంపిక పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ అని చిరంజీవి లీక్ ఇచ్చేసారు. మెగాస్టార్ కూడా కామెడీ జనాల్లో సినిమాలు చేసి చాలా కాలమవుతుంది.
దీంతో ఆయా పాత్రలకు ...చిరంజీవి టైమింగ్ ని మ్యాచ్ చేసే నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. అనీల్ సినిమా అంటే బడ్జెట్ లోనే ఉంటుంది. ఓవర్ ది బడ్జెట్ ఎప్పుడూ ఉండదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే కథలే అనీల్ సక్సెస్ అన్నది తెలిసిందే. తాజాగా మెగాస్టార్ ప్రాజెక్ట్ విషయంలోనే అనీల్ అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారుట. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం అనవసరమైన , అదనపు ఖర్చులు లేకుండా పిన్ టూ పిన్ జాగ్రత్త పడుతున్నాడుట.
నిర్మాత పెట్టే ప్రతీ రూపాయికి అనీల్ జవాబు దారీ తనంతో ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అనీల్ కు బడ్జెట్ పరంగా ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తి స్వేచ్ఛ ని కల్పించినట్లు తెలుస్తోంది.