మెగాస్టార్ 'యానిమల్' ఎప్పుడు భయ్యా?
చిరంజీవిని ఒక మాస్ యాంగిల్‌లోనే కాకుండా బోల్డ్, వైల్డ్ పాత్రలో సందీప్ చూపించగలడు అని మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
By: Tupaki Desk | 4 Dec 2024 4:53 AM GMTమెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 2024లో ఒక్క సినిమాను విడుదల చేయలేక పోయిన చిరంజీవి 2025లో మాత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభర సినిమాతో పాటు ఇటీవల ప్రకటించిన శ్రీకాంత్ ఓదెల సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చేస్తున్న అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఏంటి అంటే చిరంజీవి సినిమా అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి 2025 సంక్రాంతికి వెంకటేష్‌తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతూ ఉన్నాడు. 2026లో ఆయన చిరంజీవితో కలిసి సంక్రాంతికి వస్తాడని తెలుస్తోంది. అదే నిజం అయితే మెగా ఫ్యాన్స్‌కి పండుగ ఖాయం. ఈ సమయంలోనే చిరంజీవి గతంలో ఓకే చెప్పిన సందీప్ వంగ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే చర్చ మొదలు అయ్యింది. చిరంజీవిని ఒక మాస్ యాంగిల్‌లోనే కాకుండా బోల్డ్, వైల్డ్ పాత్రలో సందీప్ చూపించగలడు అని మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో, త్వరలో చేయబోతున్న సినిమాల్లో సందీప్ రెడ్డి వంగ సినిమా ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేదు. గతంలో వీరి కాంబోలో ఒక మూవీ ఉంటుంది అనే వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్చల ముందడుగు పడ్డట్లుగా తెలియడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సందీప్ రెడ్డి వంటి ప్రతిభావంతుడు అయిన దర్శకుడితో కచ్చితంగా చిరంజీవి సినిమా చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా కోసం సందీప్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభించి 2026లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పిరిట్ తర్వాత యానిమల్ పార్ట్ సినిమాను సందీప్ వంగ చేయాల్సి ఉంది. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చిన తర్వాత అప్పుడు సందీప్ వంగ తదుపరి సినిమా గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్ సందీప్ తో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం చిరంజీవితో ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పటికి ఆ సినిమా పట్టాలెక్కేను, అసలు ఇద్దరి కాంబో మూవీ ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే కనీసం రెండేళ్ల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.