Begin typing your search above and press return to search.

చిరు, రావిపూడి ప్రాజెక్ట్ సంగతేంటి.. సాహసమేనా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Feb 2025 5:30 PM GMT
చిరు, రావిపూడి ప్రాజెక్ట్ సంగతేంటి.. సాహసమేనా?
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుండగా, ఆ తర్వాత చిరునే రివీల్ చేశారు. మరికొద్ది నెలల్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కామెడీ జోనర్ లో మూవీ ఉంటుందని.. క్రేజీ హింట్ కూడా ఇచ్చారు.

2026 సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యేలా చిరంజీవి, అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా చిరు- రావిపూడి మూవీ బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. సినిమా వర్కౌట్ అయ్యేలా లేదని కొందరు చెబుతున్నారు!

బడ్జెట్ విషయంలో పెద్ద సాహసమేనని అంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాకు గాను చిరంజీవి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రూ.75 కోట్లు అందుకోనున్నారని వినికిడి. ఆయన కుమార్తె సుస్మిత నిర్మాణంలో భాగమవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆమెకు రూ.10 కోట్ల వరకు ఇవ్వాల్సిందేనట!

అలా మొత్తం రావిపూడి ప్రాజెక్టుకు చిరంజీవి రూ.85 కోట్లు తీసుకోనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో వరుస హిట్స్ తో జోష్ మీద ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.25 కోట్లు అందుకోనున్నారని సమాచారం. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. సూపర్ హిట్ అయ్యి రూ.300 కోట్లకు పైగా రాబట్టింది.

అయితే చిరు, రావిపూడి రెమ్యునరేషన్లు కలిపి రూ.110 కోట్లు అయిపోయాయి! ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి అవో రూ.100 కోట్లు అవ్వడం పెద్ద విషయం కాదు. దీంతో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో మూవీ రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. మరి వసూళ్లు ఎలా ఉంటాయి? లాభాలు ఎంత వస్తాయనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్.

ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా.. సినిమాలో మ్యాటర్ ఉంటే చాలు.. భారీ హిట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. కాబట్టి అనిల్ రావిపూడి, చిరు మూవీ ఎలా ఉంటుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు ఇప్పుడు ఓటీటీలు కూడా రూట్ మార్చేశాయి. పెద్దగా పెట్టుబడి పెట్టడం లేదు. అసలు తొందర పడటం లేదు.

చిరు అప్ కమింగ్ మూవీ విశ్వంభర విషయంలో కూడా అదే జరిగింది. అయితే చిరు క్రేజ్, రావిపూడి సక్సెస్ సీక్రెట్.. కలిసి రూ.200 కోట్లు రాబడితే కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రం వస్తుంది. కానీ లాభాలు రావు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే సంక్రాంతికి వచ్చి సినిమా అదిరిపోతే వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.