మెగాస్టార్ కోసం వైజాగ్ లో వేడి వేడిగా!
మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 March 2025 7:11 AMమెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వేసవిలో మొదలవుతుందని ఇప్పటికే చిరంజీవి ప్రకటించారు. ప్రస్తుతం అనీల్ అండ్ కో వైజాగ్ లో ఉంది. టీమ్ అంతా స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయ్యారు. వైజాగ్ హోట్ లో కూర్చుని కథలు రాసుకోవడం అనీల్ కి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. డైరెక్టర్ కాకముందు నుంచి వైజాగ్ లో నే తన కథలు మొదల య్యాయని చాలా సందర్భాల్లో చెప్పాడు.
తానిప్పుడు స్టార్ డైరెక్టర్ అయినా? కథలు రాసుకోవడం కోసం విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికీ వైజాగ్ లో అదే హోటల్ లో కూర్చుని రాస్తున్నాడు. వైజాగ్ లో ఓవైబ్ ఉందని అందుకే అక్కడ కలం పెడితే పరుగులు పెడుతుందన్నది అనీల్ నమ్మకం. ఈసినిమా కోసం కూడా పాతటీమ్ రైటింగ్ టీమ్ నే యధా విధిగా కొనసాగిస్తున్నాడు. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకు పనిచేసిన రైటర్స్ టీం అంతా స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు.
అనిల్ రావిపూడి కాకుండా మరో పది మంది రచయితల బృందం అతనితో పాటే ఉంది. ఏప్రిల్ చివరికల్లా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని తెలిసింది. అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం తన కోర్ టెక్నికల్ టీమ్‌ని రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భీమ్స్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పనిచేసిన డైరక్షన్ టీమ్ అంతా యధావిధిగా చిరంజీవి సినిమా కోసం పనిచేయనుంది. ఇదికూడా పక్కా కామెడీ ఎంటర్ టైనన్ అని ముందే చెప్పేసారు. కాబట్టి కథ పరంగా ఏదో అద్భుతం అని ఊహించాల్సిన పనిలేదు. రొటీన్ కథనే అనీల్ గొప్పగా చెప్పడంలో నేర్పరి. అతడి సక్సస్ సీక్రెట్ కూడా అదే. మేలో మెగాస్టార్‌పై ఓ పాట చిత్రీకరించి జూన్‌లో టాకీ పార్ట్‌ను ప్రారంభిం చనున్నారుట.