మెగా - అనిల్.. అసలు మోత ముందుగానే..
ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు దాదాపు తెరపడినట్లే అని తెలుస్తోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియోను మెగాస్టార్ మూవీకి సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు టాక్.
By: Tupaki Desk | 15 March 2025 3:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోయే చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసింది. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించే సినిమా వస్తుందని అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎడాపెడా నవ్వించే స్క్రీన్‌ప్లే, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామాతో ఓ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను డిజైన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు అందిస్తారనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది.
ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు దాదాపు తెరపడినట్లే అని తెలుస్తోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియోను మెగాస్టార్ మూవీకి సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు టాక్. ఇంకా అఫీషియల్ గా క్లారిటీ రాకపోయినా దాదాపు అతనే బెస్ట్ అని అనిల్ డిసైడ్ అయ్యారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భీమ్స్ ఈ సినిమాలో నాలుగు పాటల్ని ఇప్పటికే కంపోజ్ చేసేశాడట. ఇది మెగాస్టార్ సినిమాలకు ఇప్పటివరకు లేని ట్రెండ్ అని చెప్పుకోవాలి.
సాధారణంగా సినిమాకు స్క్రిప్ట్ పూర్తి అయ్యాక, ఒకట్రెండు షెడ్యూల్స్ అయిన తర్వాత మ్యూజిక్ వర్క్ ప్రారంభమవుతుంది. కానీ అనిల్ రావిపూడి తన స్టైల్ లో ముందుగానే మ్యూజిక్ వర్క్‌ను కంప్లీట్ చేయిస్తున్నాడు. అందులోనూ భీమ్స్ ప్రస్తుతం మాస్ ఆల్బమ్‌లకు స్పెషలిస్ట్‌గా మారిపోయాడు. 'మ్యాడ్,' 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి సినిమాలకు ఇచ్చిన పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక చిరు సినిమాలో అద్భుతమైన మాస్ బీట్‌తో ఒక పాట, మరో పూర్తి ఫోక్ సాంగ్ ఉండబోతున్నాయని టాక్. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, వీటిలో ఒక పాట ఏకంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించేలా ఉంటుందట. ఇంకా షూటింగ్ మొదలుకాకముందే ఈ తరహా వర్క్ కొంత వరకు ఫినిష్ అవ్వడం చాలా గ్రేట్. అసలే నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా కాబట్టి ముందే మ్యూజిక్ వర్క్ ఫినిష్ అయితే పెద్ద భారం తగ్గుతుంది.
భీమ్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. మీడియం రేంజ్ సినిమాలే కాకుండా, పెద్ద హీరోల సినిమాలకు కూడా తన సత్తా చాటుతున్నాడు. 'మ్యాడ్ స్క్వేర్,' 'మాస్ జాతర,' 'డెకాయిట్' లాంటి సినిమాలతో పాటు, ఇప్పుడు చిరు సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇదంతా చూస్తుంటే భీమ్స్ కెరీర్‌లో ఇదే టర్నింగ్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది. చిరంజీవితో చేసిన ఈ సినిమా తర్వాత టాలీవుడ్‌లో అతని రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మెగాస్టార్ - అనిల్ రావిపూడి సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే 2025 చివరి నాటికి షూటింగ్ పూర్తవ్వాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఆల్బమ్ రెడీ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరిగే విషయం.