Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమా సంక్రాంతి వ‌ర‌కూ సాగ‌దీస్తారా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ క‌న్ప‌మ్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Feb 2025 3:47 AM GMT
మెగాస్టార్ సినిమా సంక్రాంతి వ‌ర‌కూ సాగ‌దీస్తారా?
X

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ క‌న్ప‌మ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇది మెగాస్టార్ 157వ చిత్రంగా ప‌ట్టాలెక్కుతుంది. సాహూగార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే స‌ద‌రు నిర్మాత సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ ప్ర‌క‌టించ‌డం విశేషం. ఈ ప్ర‌క‌ట‌న ఎలా ఉందంటే? ముందే సంక్రాంతి రేసులో మేము ఉన్నామ‌ని...రిలీజ్ తేదీపై ముందుగానే క‌ర్చీప్ వేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

సంక్రాంతి వెళ్లి ఇంకా నెల రోజులు కూడా పూర్త‌వ్వ‌లేదు. ఇంత‌లోనే 2026 సంక్రాంతి పై నిర్మాత గురి పెట్ట‌డం విడ్డూర‌మే. పైగా మెగాస్టార్ తో అనీల్ తీయ‌బోయే సినిమా భారీ కాన్సాస్ పై చేసే సినిమా కూడా కాదు. ఇది ప‌క్కా అనీల్ మార్క్ చిత్రం. అందులో ఎలాంటి డౌట్ లేదు. అనీల్ నుంచి ఎలాంటి సినిమాలు వ‌స్తాయి? అన్న‌ది ఆయ‌నే ముందే చెప్పేసాడు. త‌న మార్క్ కామెడీ కం ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్లే చేస్తాడు. ఇప్పుడు చిరంజీవితో అనీల్ కొత్త‌గా ఏదో అద్భుతాలు చేయ‌డు.

మెగా ప్రేక్షకాభిమానుల ప‌ల్స్ ప‌ట్టుకునే సినిమా తీస్తాడు. చిరంజీవి కి కూడా కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. సీరియ‌స్ క‌థ‌ల్లో సైతం కామెడీ ట్రాక్ లు ట్రై చేస్తుంటారాయ‌న‌. అలాంటి స్టార్ కి అనీల్ తోడైతే? ఆ కామెడీ పీక్స్ కి చేరుతుంది. అనీల్ ప‌క్కాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు కాబ‌ట్టి చిరంజీవి ఇమేజ్ ని ప‌ట్టుకుని ప్రేక్ష‌కుల‌కు క‌మ‌ర్శియ‌ల్ గా క‌నెక్ట్ చేసే చిత్రం చేస్తాడు? త‌ప్పు అనీల్ చిరంజీవితో అద్భుతాలు ఏవో సృష్టిస్తాడు అన్న‌ది క‌నీసం ఊహకి కూడా రానిది.

అలాగే అనీల్ షూటింగ్ కి కూడా ఎక్కువ స‌మ‌యం తీసుకోడు. చిత్రీక‌ర‌ణ స‌హా పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌న‌లు వేగంగా పూర్తి చేయ‌గ‌ల‌గ‌డు. నిర్మాత‌కు వీలైనంత బ‌డ్జెట్ త‌గ్గించే డైరెక్ట‌ర్ ఆయ‌న‌. అందుకే దిల్ రాజు బ్యాన‌ర్లో బంగారు బాతులా మారాడు. అలాంటి అనీల్-చిరంజీవి ప్రాజెక్ట్ ను వ‌చ్చే సంక్రాంతికి అని స‌ద‌రు నిర్మాత ప్ర‌క‌టించ‌డంపై భిన్నా భిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే ప్రారంభ మ‌వుతుంది. ఒకవేళ ప‌క్కాగా సంక్రాంతి రిలీజ్ అనుకుంటే? 11 నెల‌లు పాటు అనీల్ ఇదే ప్రాజెక్ట్ పై ప‌ని చేయాలి. ఇక ప్ర‌శాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా సంక్రాంతి రిలీజ్ అన్న‌ది అసాధ్య‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.