మెగాస్టార్ తో అనీల్ కూల్ గా కాఫీ తాగుతూ!
మరో పదిహేను రోజులు వైజాగ్ పార్క్ హయత్ లో కూర్చుంటే అది కూడా సిద్దమవుతుంది. అలాగే హీరో యిన్ గా పది మంది భామల్ని పరిశీలిస్తున్నారట.
By: Tupaki Desk | 14 March 2025 4:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వేసవి నుంచే మొదలువుతందని తెలుస్తోంది. ప్రస్తుతం అనీల్ రావిపూడి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ప్రధమార్ధం డైలాగ్ వెర్షన్ కూడా సిద్దమైందట. ఇక పెండింగ్ ద్వితియార్దం రెడీ అవ్వాలి.
మరో పదిహేను రోజులు వైజాగ్ పార్క్ హయత్ లో కూర్చుంటే అది కూడా సిద్దమవుతుంది. అలాగే హీరో యిన్ గా పది మంది భామల్ని పరిశీలిస్తున్నారట. అందులో ఫైనల్ అయ్యేది ఇద్దరు భామలు అని సమాచారం. ఒకరు మెయిన్ లీడ్ గా కాగా..మరొకరు సెకెండ్ లీడ్. అయితే ఆ జాబితాలో ఎవరెవరు? ఉన్నారన్నది ప్రత్యేకించి పేర్లు బయటకు రాలేదు. కానీ అదితి రావు హైదరి పేరు మాత్రం టాప్ లో ఉన్నట్లు వినిపిస్తుంది.
చిరంజీవి మెయిన్ లీడ్ లో ఆమె అయితే బాగుంటుందని అనీల్ భావిస్తున్నాడు. చిరంజీవి వయసును కూడా అతిది అయితే మ్యాచ్ చేయగలదు. సీనియర్ హీరోలకు హీరోయిన్లు ఎంపిక చేయడం అన్నది కష్టమైన పనే. అందులోనూ చిరంజీవి...బాలయ్యకు హీరోయిన్లు అతి కష్టం మీద సెట్ అవుతున్నారు కొంత కాలంగా. వెంకేటష్ , నాగార్జునలకు పర్వాలేదు గానీ....చిరు బాలయ్య ఇమేజ్ లకు సెట్ అవ్వడం అన్నది దర్శకులకు భారంగా మారుతుంది.
ఈ క్రమంలో అతిది రావు హైదరీ అయితే చిరుకు జోడీగా బాగుంటుంది. చిత్రీకరణ వేగం ముగించడం అన్నది అనీల్ కి పెద్ద పనేం కాదు. చిరంజీవి సహకరించాలి గానీ రెండు..మూడు నెలలోన పూర్తి చేస్తాడు. కానీ ఎలాగూ సంక్రాంతి రిలీజ్ చేతిలో కావాల్సినంత సమయం ఉన్నట్లే. కూల్ గా కాఫీ తాగుతూ ఆడతా పాడతా షూటింగ్ పూర్తి చేయోచ్చు. అనీల్ ప్లానింగ్ ఎంతో పక్కాగా ఉంటుంది. బడ్జెట్ కూడా పరిమితంగానే ఉంటుంది. అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలోనే పూర్తి చేసే దర్శకుడిగా అనీల్ కు మంచి పేరుంది.