Begin typing your search above and press return to search.

అంజి మూవీ ఐదేళ్లు.. అసలు కారణం ఇదే

మూవీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అంత సింగపూర్, మలేషియా, అమెరికా టీమ్ లతో చేయించారంట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన సన్నివేశాలన్నీ కూడా అమెరికా పంపించారంట.

By:  Tupaki Desk   |   1 Sep 2024 4:30 AM GMT
అంజి మూవీ ఐదేళ్లు.. అసలు కారణం ఇదే
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీ అంజి. 2004 లో ఈ చిత్రం రిలీజ్ అయింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఇంటరెస్టింగ్ కథాంశంతో ఉన్న కూడా ఎందుకనో అంజి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అంత అద్భుతంగా కోడి రామకృష్ణ తెరకెక్కించారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కృషి కూడా ఇందులో ఎంతో ఉంది. క్లైమాక్స్ సన్నివేశాలు అయితే గూస్ బాంబ్స్ క్రియేట్ చేస్తాయి అని చెప్పొచ్చు.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రంలో అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా ఎందుకు డిజాస్టర్ అయ్యింది అనేది ఎప్పటికి ఎవరికి అర్థం కాదని ఓ వర్గం వారు ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బలమైన ఎమోషన్స్ తో పాటు, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రం ప్రేక్షకుల్ని కట్టిపడేసే విధంగా ఉంది. ఈ సినిమా అప్పట్లో ఐదేళ్లు షూటింగ్ జరుపుకొని అందరికి షాక్ ఇచ్చింది.

అందుకే మూవీలో చిరంజీవి లుక్స్ కూడా చాలా సీన్స్ లలో వేర్వేరుగా ఉంటాయి. నమ్రతా శిరోద్కర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ అప్పట్లో ఈ మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించడం విశేషం. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ ని ఏకంగా నెల రోజులు పాటు షూట్ చేశారంట. అయిన కానీ చిరంజీవి చాలా ఓపిగ్గా షూటింగ్ లో పాల్గొనే వారంట. ఇక సినిమా గ్రాఫిక్స్ వర్క్ వల్లనే చాలా టైమ్ పట్టిందట. మూవీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అంత సింగపూర్, మలేషియా, అమెరికా టీమ్ లతో చేయించారంట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన సన్నివేశాలన్నీ కూడా అమెరికా పంపించారంట.

ఆ ఫుటేజ్ అంతా కూడా అక్కడ వారు తీసుకొని మళ్ళీ డిస్క్ లని అదే రోజు తిరిగి వెనక్కి పంపించేసేవారంట. అలాగే ఎక్కువ రోజులు షూట్ చేయడం తో పాటు, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా మెగాస్టార్ చిరంజీవి ఒకే డ్రెస్ ని కనీసం వాష్ కూడా చేయకుండా షూట్ చేసినన్ని రోజులు వేసుకున్నారంట. ఇలా గ్రాఫిక్స్ వర్క్ కోసం ఎక్కువ కాలం షూట్ చేయడం వలన మూవీ రిలీజ్ కావడానికి చాలా కాలం పట్టిందని దర్శకుడు కోడి రామకృష్ణ గత ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అత్యధిక బడ్జెట్ కావడంతో నిర్మాత ఇబ్బంది పడ్డారని ఆ మధ్య టాక్ వచ్చింది.

అలాగే ఈ సినిమా ప్రారంభంలో వచ్చే సీక్వెన్స్ లో మాంత్రికుడు క్యారెక్టర్ కోసం చాలా మందిని టెస్ట్ చేయడం జరిగిందంట. ఫైనల్ గా ఎల్.వి.ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర బెగ్గింగ్ చేసుకునే వ్యక్తిని చూసినపుడు మాంత్రికుడి క్యారెక్టర్ కి సరిపోతాడని కోడి రామకృష్ణకి అనిపించిందంట. అతనినే సినిమాలో యాక్ట్ చేయించినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంజి సినిమా ఐదేళ్లు లేట్ కావడానికి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కారణం అని తెలుస్తోంది.