బాలయ్య లవ్స్ చిరంజీవి..!
నందమూరి నట సింహం బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయి.
By: Tupaki Desk | 9 Dec 2024 5:53 PM GMTనందమూరి నట సింహం బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయి. సినిమాల పరంగా, రికార్డులు, కలెక్షన్స్ పరంగా ఎంత పోటీ ఉన్నా పర్సనల్ గా మాత్రం చిరంజీవి అంటే బాలకృష్ణకు, బాలయ్య అంటే చిరంజీవికి అభిమానం, ఇష్టం. ఐతే ఆ ఇష్టాన్ని ఒక్కోసారి ఒక్కోలా వ్యక్తపరుస్తారు. అన్ స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణ వేరే యాంగిల్ ప్రేక్షకులకు తెలిసింది. ఆయన ఎంత సరదా మనిషో అందరికి ఈ షో చూశాక తెలిసింది.
ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 నడుస్తుంది. ఈ సీజన్ లో లేటెస్ట్ ఎపిసోడ్ లో యువ హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. నవీన్ పొలిశెట్టి సెన్సాఫ్ హ్యూమర్ కి బాలకృష్ణ ఫిదా అయ్యారు. అతను కెరీర్ లో ఈ స్టేజ్ కి వచ్చేందుకు పడిన కష్టం తెలుసుకుని ఇంప్రెస్ అయ్యారు. ఈ క్రమంలో షోలో ఒక హుక్ స్టెప్ కనిపెట్టే టాస్క్ ఇచ్చారు. నవీన్ పొలిశెట్టి, శ్రీలీల మధ్య జరిగిన ఈ ఆటలో శ్రీలీల బుట్ట బొమ్మ సాంగ్ ని కనిపెట్టి స్టెప్ వేసింది.
నవీన్ పొలిశెట్టి దాయి దాయి దామ్మ పాట కనిపెట్టి స్టెప్ వేశాడు. ఐతే ఈ స్టెప్ నవీన్, శ్రీలీల ఎవరు కరెక్ట్ గా వేయలేదని ఈ పాయింట్ నా బ్రదర్ చిరంజీవికి ఇస్తున్నా అన్నారు. ఆ తర్వాత పాట కుర్చీమడత పెట్టి రాగా ఈ పాయింట్ మహేష్ కి ఇస్తారా అంటే లేదు మహేష్ కి ఇవ్వనని అన్నారు. మొత్తానికి చిరంజీవి పాట రాగానే ఆయన బ్రదర్ చిరంజీవికి పాయింట్ అని చెప్పడం చిరు మీద బాలకృష్ణకు ఉన్న అభిమానం ఏంటన్నది అర్థమవుతుంది.
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు దాదాపు ఐదు దశాబ్దాలుగా నటులుగా రాణిస్తూ వారి మధ్య ఉన్న బంధాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. సమయం వచ్చినప్పుడల్లా ఇలా ఒకరి మీద మరొకరు ఇలా తమ ప్రేమను చూపిస్తారు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ అలాంటి కథ సెట్ అవ్వట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉండగా.. బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా పనుల్లో ఉన్నాడు. అసలైతే ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది కానీ గేం ఛేంజర్ కోసం విశ్వంభర వాయిదా వేశారు.