విశ్వంభర కోసం బ్లాక్ బస్టర్ సెంటిమెంట్
మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రమైన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' మూవీ మే 9న రిలీజ్ అయ్యింది.
By: Tupaki Desk | 19 Dec 2024 3:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' అనే బిగ్ బడ్జెట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. నిజానికి 'విశ్వంభర' సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' కోసం మెగాస్టార్ తన ప్రాజెక్ట్ ని వాయిదా వేయించారు. అయితే ఈ వాయిదా కూడా ఒకందుకు మంచిదనే మాట వినిపిస్తోంది. సీజీ వర్క్ మరింత క్వాలిటీతో ప్రెజెంట్ చేసే అవకాశం విశిష్టకి వచ్చింది.
సోషియో ఫాంటసీ చిత్రంగా సిద్ధమవుతోన్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే మే 9న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ నిర్ణయించడానికి వేరొక కారణం కూడా ఉందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రమైన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' మూవీ మే 9న రిలీజ్ అయ్యింది.
అందుకే సెంటిమెంటల్ గా కలిసొస్తుందని యూవీ క్రియేషన్స్ వారు కూడా అదే డేట్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అలాగే సంక్రాంతికి 'విశ్వంభర' మూవీ నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఉండొచ్చని భావిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో త్రిష మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో ఈ సినిమాని 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రంతో పోల్చి చూస్తున్నారు. అయితే ఈ సినిమా కథ భిన్నమైన వరల్డ్ లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఏది ఏమైనా ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి కచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ పడాలి. సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలలో ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన మూవీ 'వాల్తేరు వీరయ్య' మాత్రమే. తరువాత వచ్చిన భోళా శంకర్ అందరిని నిరాశపరిచింది. అయితే 'విశ్వంభర' నుంచి మెగాస్టార్ కథల ఎంపిక మార్చుకున్నట్లు తెలుస్తోంది. రీమేక్ ల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.