Begin typing your search above and press return to search.

నువ్వు చూస్తున్న చిరంజీవి ఏం చేస్తాడయ్యా..!

తన కథ చిరంజీవికి నచ్చలేదు ఇక నెక్స్ట్ ఛాన్స్ లేదని అనుకున్న టైం లో మళ్లీ తాను వెళ్తున్న టైం లో మొత్తం కథ కట్టే కొట్టే తెచ్చే లాగా చిరంజీవి గారు తనకు చెప్పారని.

By:  Tupaki Desk   |   2 Feb 2025 2:30 AM GMT
నువ్వు చూస్తున్న చిరంజీవి ఏం చేస్తాడయ్యా..!
X

మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఒక డైరెక్టర్ కి ఆ ఛాన్స్ ఇస్తే కాదనడమే కాకుండా నేను చూస్తున్న చిరంజీవి అందులో లేడని చెప్పాడు. దాంతో చిరంజీవి అతనితో మళ్లీ సినిమా చేయరేమో అనుకుంటే ఆ నెక్స్ట్ సినిమానే అతనితో చేశాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు ఏంటా కథ అంటే ఒక 4 ఏళ్లు అలా వెనక్కి వెళ్లాల్సిందే. రైటర్ గా సక్సెస్ అయ్యి ఆ నెక్స్ట్ డైరెక్టర్ గా మారి సక్సెస్ ఫుల్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు దర్శకుడు బాబీ.

ఈమధ్యనే బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఐతే చిరంజీవితో ఆయన వాల్తేరు వీరయ్య సినిమా చేశారు. బాబీ ఆ సినిమా కన్నా ముందు జరిగిన బ్యాక్ స్టోరీని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది చిరంజీవి లూసిఫర్ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్న టైం. ఒకరిద్దరు దర్శకులు కాదన్నాక బాబీని పిలిచి చిరంజీవి లూసిఫర్ సినిమా రీమేక్ గురించి ప్రస్తావించారట.

ఐతే అది తను ఓన్ చేసుకోలేకపోతున్నా అని అన్నాడట బాబీ. ఐతే వెళ్లి మీ నాన్నకు చిరంజీవి సినిమా ఇస్తానంటే నేనే వద్దన్నా అని చెప్పు పో అన్నారట. బాబీ చిరంజీవితో లూసిఫర్ లో తాను చూస్తున్న చిరంజీవి అందులో లేడని అన్నాడట. సరే అది పక్కన పెట్టు అసలు నువ్వు చూస్తున్న చిరంజీవి ఏం చేస్తాడయ్యా అని అన్నారట. అప్పుడు బాబీ చిరంజీవి అంటే నోట్లో బీడీ, లుంగీ కట్టి అలా స్వాగ్ తో కనిపించాలని అన్నాడట. ఐతే మరి నువ్వు ఎలా చూపిస్తావ్ అనగా అప్పుడే వాల్తేరు వీరయ్య ఇంట్రడక్షన్ షాట్ ని చెప్పానని ఆ తర్వాత కథ మొత్తం చెప్పగా మధ్యలో ఆయన నిద్రపోయారని చెప్పాడు బాబీ.

తన కథ చిరంజీవికి నచ్చలేదు ఇక నెక్స్ట్ ఛాన్స్ లేదని అనుకున్న టైం లో మళ్లీ తాను వెళ్తున్న టైం లో మొత్తం కథ కట్టే కొట్టే తెచ్చే లాగా చిరంజీవి గారు తనకు చెప్పారని. ఐతే సీన్స్ బాగున్నాయి కానీ కథలో సోల్ లేదు అనడంతో 20 రోజులు ఇస్తే సోల్ సిద్ధం చేస్తానని బాబీ అన్నాడట. 18 రోజు మళ్లీ గుర్తు చేసి ఇంకా రెండు రోజులే అని మెసేజ్ పెట్టడం గురించి కూడా బాబీ చెప్పుకొచ్చారు.

చిరంజీవి ఒక సినిమా చేయాలనే కారణంతో బాబీని ఇంటికి పిలిస్తే తన కథతో ఆయన్ని ఒప్పించి వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు బాబీ. మెగాస్టార్ చిరంజీవి మార్క్ మాస్ క్లాస్ ఎంటర్టైనర్ గా వాల్తేరు వీరయ్య కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ రోల్ కూడా సినిమా కొంత పార్ట్ షూట్ చేశాక రాసుకున్నారని ఆ సినిమా రిలీజ్ టైం లో బాబీ చెప్పుకొచ్చారు.