Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ చిరూని మ‌రోసారి మెప్పిస్తాడా?

ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి మ‌రో యంగ్ డైరెక్ట‌ర్ తో కూడా సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 March 2025 6:17 AM
Chiranjeevi In Talks For Bobby Film
X

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం క్రేజీ లైనప్ తో దూసుకెళ్తున్నారు. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా చిరంజీవి టాలీవుడ్ లో త‌న స‌త్తా చాటుతూ స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వశిష్ట ద‌ర్శ‌క‌త్వంలో విశ్వంభ‌ర సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి చేసే ప‌నిలో చిరూ బిజీగా ఉన్నారు.

ఓ వైపు విశ్వంభ‌ర‌ను పూర్తి చేస్తూనే చిరూ త‌న త‌ర్వాతి సినిమాల కోసం క‌థ‌ల‌ను వింటూ న‌చ్చిన క‌థ‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అలా ఇప్ప‌టికే చిరూ రెండు సినిమాల‌ను ఓకే చేశారు. అందులో ఒక‌టి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సినిమా కాగా, మ‌రొక‌టి శ్రీకాంత్ ఓదెల‌తో చేయాల్సిన సినిమా.

ఈ రెండింటిలో విశ్వంభ‌ర త‌ర్వాత చిరూ చేయబోయే సినిమా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలోనే. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో సాహు గార‌పాటి ఈ సినిమాను నిర్మించ‌నుండ‌గా, ఉగాది రోజున సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లవ‌నుంద‌ని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ అనౌన్స్ కూడా చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి మ‌రో యంగ్ డైరెక్ట‌ర్ తో కూడా సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. అత‌ను మ‌రెవ‌రో కాదు బాబీ కొల్లి. ఆల్రెడీ చిరూతో బాబీ గతంలో వాల్తేరు వీర‌య్య సినిమా చేసి సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబో సెట్ అయ్యే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికి క‌థ చెప్ప‌డం కోసం డైరెక్ట‌ర్ బాబీ మంచి క‌థ‌ను రెడీ చేసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. ఆల్రెడీ దీనికి ముందు చిరూ, బాబీకి మధ్య డిస్క‌ష‌న్స్ కూడా జ‌రిగాయ‌ని టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే బాబీ క‌థ‌కు చిరూ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఖాయమ‌ని, ఈ ఉగాదికి అనౌన్స్‌మెంట్ వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు.