Begin typing your search above and press return to search.

వీర‌య్య కాంబినేష‌న్‌తో మాస్‌లో మ‌ళ్లీ పూన‌కాలే

త‌దుప‌రి వాల్తేరు వీర‌య్య కాంబినేష‌న్ రిపీట్ కానుంద‌ని స‌మాచారం. బాబి కొల్లి మ‌రోసారి మెగాస్టార్ కోసం ఒరిజిన‌ల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 4:21 AM GMT
వీర‌య్య కాంబినేష‌న్‌తో మాస్‌లో మ‌ళ్లీ పూన‌కాలే
X

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ఒరిజినల్ స్క్రిప్టుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిరు సోషియో ఫాంట‌సీ డ్రామాలో నటిస్తున్నారు. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి త‌ర్వాత చాలా కాలానికి ఒక సోషియో ఫాంట‌సీలో ఆయ‌న న‌టిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. 1990లో వ‌చ్చిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సంచ‌ల‌న వ‌సూళ్లను సాధించి, చిరంజీవి కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇప్పుడు ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ అలాంటి ఫీట్ ని రిపీట్ చేయాల‌ని క‌ల‌లుగంటున్నాడు. చిరును వీఎఫ్ఎక్స్ వండ‌ర్ లో అద్భుతంగా ఆవిష్క‌రించేందుకు చేయాల్సిన హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలోనే చిరు మ‌రో ఒరిజిన‌ల్ స్క్రిప్ట్ నేరేట్ చేసిన‌ యువ‌త‌రం ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పారు. టాలీవుడ్ యువ‌ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల వినిపించిన లైన్ కి చిరు ఓకే చెప్ప‌డంతో త‌దుప‌రి సినిమాపైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. నేచుర‌ల్ స్టార్ నానికి ద‌స‌రా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని అందించిన శ్రీ‌కాంత్ ఓదెలా మెగా స్క్రిప్టు పై పూర్తి స్థాయిలో ప‌ని చేస్తున్నారని తెలిసింది.

త‌దుప‌రి వాల్తేరు వీర‌య్య కాంబినేష‌న్ రిపీట్ కానుంద‌ని స‌మాచారం. బాబి కొల్లి మ‌రోసారి మెగాస్టార్ కోసం ఒరిజిన‌ల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. బాబి మ‌రోసారి `వాల్తేరు వీర‌య్య` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిపీట్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడ‌ట‌. చిరంజీవిని అన్న‌య్య అని పిలుచుకునే బాబి ఈసారి మెగాస్టార్ ని మ‌రో స్థాయిలో ఎలివేట్ చేయాల‌ని పంతంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. బాబి- చిరు కాంబినేష‌న్ అంటే మాస్ ఫ్యాన్స్ లో మ‌ళ్లీ పూన‌కాలే.. మ‌రోసారి బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సంద‌డి పీక్స్ కి చేరుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.