చిరు క్రిస్మస్ విషెస్.. బ్యాక్ గ్రౌండ్ అదిరిందిగా..
క్రిస్మస్ ట్రీస్ లా కనిపిస్తున్న మంచుతో నిండి ఉన్న చెట్ల వద్ద తీసుకున్న పిక్స్ ను చిరు షేర్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
By: Tupaki Desk | 25 Dec 2024 11:54 AM GMTవరల్డ్ వైడ్ గా నేడు క్రిస్మస్ వేడుకలు అంతా గ్రాండ్ గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతో హ్యాపీగా ఫెస్టివల్ ను సెలబ్రిటీ చేసుకుంటున్నారు. ఆఫీసుల్లో సీక్రెట్ శాంటా ఆడుకుంటున్నారు. అదే సమయంలో పలువురు సినీ ప్రముఖులు.. సోషల్ మీడియాలో ద్వారా ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు, సన్నిహితులకు, శ్రేయాభిలాషులకు బెస్ట్ క్రిస్మస్ విషెస్ చెబుతున్నారు.
ఆ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో నవ్వులను సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ పెట్టారు. అదే సమయంలో పలు పిక్స్ ను షేర్ చేశారు. అందులో చిరు వేరే లెవెల్ లో ఉన్నారు. తన లుక్స్ తో ఆకట్టుకున్నారు.
క్రిస్మస్ ట్రీస్ లా కనిపిస్తున్న మంచుతో నిండి ఉన్న చెట్ల వద్ద తీసుకున్న పిక్స్ ను చిరు షేర్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. అయితే ఇప్పటి పిక్స్ కాదు.. త్రో బ్యాక్ పిక్చర్స్ అని హ్యాష్ ట్యాగ్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అవి వాల్తేరు వీరయ్య సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ టైమ్ లో దిగిన పిక్స్ గా తెలుస్తోంది. ఏదేమైనా ఫొటోస్ సూపర్ అని ఫ్యాన్స్, నెటిజన్లు చెబుతున్నారు.
మరోవైపు, చిరంజీవి.. ఇప్పుడు విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సోషల్ ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఆ మూవీ.. వచ్చే సంక్రాంతికి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన మేకర్స్.. సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు
ఆ సినిమా తర్వాత చిరు.. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో వర్క్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మించనున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన మేకర్స్.. అధికారిక ప్రకటనతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఆ తర్వాత అనిల్ రావిపూడికి చిరు ఓ ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా తమిళ డైరెక్టర్ కు చిరు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సర్దార్ ఫేమ్ మిత్రన్ తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథను చిరుకు వినిపించిన మిత్రన్.. ఓకే చేయించుకునే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్. అలా చిరంజీవి.. యంగ్ డైరెక్టర్స్ తో వరుస సినిమాలు చేసి అలరించేందుకు రెడీ అవుతున్నారన్నమాట.