మా తాత రసికుడు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
క్లాస్, మాస్ తేడా లేకుండా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు చిరంజీవి.
By: Tupaki Desk | 12 Feb 2025 6:21 AM GMTక్లాస్, మాస్ తేడా లేకుండా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు చిరంజీవి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆయన తన నటనతో మెప్పించగలడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి తనదైన సత్తా చాటుతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి రీసెంట్ గా ఓ మూవీ ఫంక్షన్ కు హాజరయ్యాడు.
ఆ ఈవెంట్ లో యాంకర్ అక్కడికి వచ్చిన సెలబ్రిటీలను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగింది. అందులో భాగంగానే చిరంజీవి తాత గారి ఫోటోను స్క్రీన్ పై చూపించి, ఆయన గురించి చెప్పమని కోరింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి తన తాత గారిని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మా తాత పేరు రాధా కృష్ణమ నాయుడు. ముందు నెల్లూరులో ఉండేవాళ్లు. కానీ తర్వాత మొగల్తూరు కు షిఫ్ట్ అయిపోయి అక్కడే సెటిలైపోయారు. ఆయన స్టేట్ ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ గా రిటైర్ అయినట్టు చెప్పాడు చిరంజీవి. నీకు ఎవరి పోలికలైనా, బుద్దులైనా రావొచ్చు కానీ ఆయన బుద్దులు మాత్రం రావొద్దురా అనేవాళ్లని, ఎందుకంటే ఆయన గొప్ప రసికుడు అని తాత గురించి వివరించాడు చిరంజీవి.
తనకు ఇద్దరు అమ్మమ్మలు అని, ఇద్దరూ ఇంట్లోనే ఉండేవారని, వీరిద్దరి మీద అలిగితే మూడవ ఆవిడ దగ్గరకి వెళ్లేవాడని, అలా తనకు తెలిసి ముగ్గురని, ఇంకా నాలుగు, ఐదు కూడా ఉండొచ్చేమో, అది తనకు తెలియదని, అందుకే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవద్దన చెప్పి మరీ ఇండస్ట్రీకి పంపించారని చిరూ ఈ సందర్భంగా వెల్లడించాడు.
అందుకే తన తాతయ్యను ఆదర్శంగా తీసుకోలేదని చిరంజీవి ఈ విషయం చెప్పగానే ఈవెంట్ మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇదిలా ఉంటే చిరంజీవి లాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ సభా ముఖంగా చెప్పడమేంటని కొందరు పెదవి విరుస్తుంటే, మరికొందరు మాత్రం ఉన్నది చెప్పడంలో తప్పేంటని ఆయన్ని సమర్థిస్తున్నారు.