చిరూ చెల్లెళ్లు.. ఒక్కొక్కరు ఒక్కో దారిలో
ఈ సినిమాలో చిరంజీవి మాధవరావు అనే క్యారెక్టర్ లో కనిపించగా, సినిమాలో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారు.
By: Tupaki Desk | 3 April 2025 1:15 PMచిరంజీవి హీరోగా 1997లో వచ్చిన హిట్లర్ సినిమా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాని కంటే ముందు చిరంజీవి నుంచి వచ్చిన బిగ్ బాస్, రిక్షావోడు సినిమాలు డిజాస్టర్లు అవడంతో ఈ హిట్లర్ సినిమా సక్సెస్ చిరంజీవికి మంచి కంబ్యాక్ ను ఇచ్చింది.
ఈ సినిమాలో చిరంజీవి మాధవరావు అనే క్యారెక్టర్ లో కనిపించగా, సినిమాలో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారు. ఆ మూవీలో చిరూకి చెల్లెళ్లుగా మోహిని, పద్మశ్రీ, అశ్వినీ, మీనా కుమారి, గాయత్రి నటించారు. చిరూకి చెల్లెళ్లుగా నటించిన ఐదుగురికీ ఆ సినిమాతో చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత వారికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి.
అవకాశాలొచ్చినప్పటికీ ఆ ఐదుగురిలో ఎవరూ సరిగ్గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. ఇదిలా ఉంటే హిట్లర్ లో చిరూకి చెల్లిగా నటించిన మీనా కుమారి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హిట్లర్ లో తనతో పాటూ నటించిన వారు ఇప్పుడేం చేస్తున్నారో వెల్లడించింది. ఆ సినిమా తర్వాత కొన్నేళ్ల వరకు అక్కా చెల్లెళ్లలానే తమ మధ్య బాండింగ్ ఉండేదని, కానీ తర్వాత ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారని మీనా కుమారి తెలిపింది.
అశ్విని కొన్ని సీరియల్స్ లో నటించి సింగపూర్ లో సెటిలైపోయిందని, మోహిని అసలు ఏం చేస్తుందో ఎక్కడుందో కూడా తెలియదని, ఆ తర్వాత ఎప్పుడూ మోహినిని చూసింది లేదని చెప్పింది. గాయత్రి మాత్రం సీరియల్స్ చేస్తుందని, తనతో కాంటాక్ట్ లోనే ఉందని తెలిపింది. పద్మశ్రీ యాక్టింగ్ మానేసి పెళ్లి చేసుకుని సెటిలైందని, తాను కూడా టచ్ లో లేదని మీనా కుమారి చెప్పింది.
ప్రస్తుతం తాను, గాయత్రి మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నామని, అశ్వినీ కూడా మళ్లీ యాక్టింగ్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ గా ఉందని చెప్పింది మీనా కుమారి. ఇదిలా ఉంటే హిట్లర్ మూవీ 1996లో వచ్చిన మలయాళ హిట్లర్ మూవీకి రీమేక్ అనే విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా స్క్రిప్ట్ ముందు ఈవీవీ దగ్గరకు వెళ్లింది. కానీ ఆయన ఆ టైమ్ లో వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల హిట్లర్ కు ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్ అయ్యారు.