Begin typing your search above and press return to search.

మత్తు వదలరా-2.. మెగాస్టార్ ఏమన్నారంటే..

మత్తు వదలరా-2.. రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఈ సినిమా కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Sep 2024 5:37 AM GMT
మత్తు వదలరా-2.. మెగాస్టార్ ఏమన్నారంటే..
X

మత్తు వదలరా-2.. రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఈ సినిమా కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. మూవీ అదిరిపోయిందని, కచ్చితంగా చూడాల్సిందేనని చెబుతున్నారు. ఫస్ట్ టూ లాస్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని కొనియాడుతున్నారు. మస్ట్ వాచ్ బుల్ మూవీ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో మత్తు వదలరా మూవీ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. వరల్డ్ వైడ్ గా సినీ ప్రియుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది.

యంగ్ హీరో శ్రీసింహా, కమెడియన్ సత్య లీడ్ రోల్స్ పోషించిన మత్తు వదలరా-2 మూవీని రితేష్ రాణా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఐదేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన మత్తు వదలరాకు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సారి సీక్వెల్ లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా యాడ్ అయింది. ఆడియన్స్ ను మూవీ కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు.

"నిన్ననే 'మత్తు వదలరా - 2' చూశాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణాకు ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేం. హ్యాట్సాఫ్ రితేష్ రాణా" అంటూ మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు.

"నటీనటులకు, శ్రీసింహకు, ప్రత్యేకించి సత్యకు అభినందనలు! అలాగే ఫరియా అబ్దుల్లా, కాల భైరవకు, మంచి విజయాన్ని అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు, కంప్లీట్ మూవీ టీమ్ అందరికీ నా అభినందనలు!.. డోంట్ మిస్ మత్తు వదలరా-2.. వంద శాతం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ" అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్.. నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. చిరు పెట్టిన ట్వీట్ అక్షరాలా నిజమని సినీ ప్రియులు చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. శ్రీసింహా, సత్య, ఫరియాతో పాటు వెన్నెల కిషోర్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మించారు. తొలిరోజు వరల్డ్ వైడ్ గా అద్భుతమైన వసూళ్లు సాధించిన మత్తు వదలరా-2... బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తోంది. మరి ఫుల్ రన్ లో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాలి.