ఒకే ఫ్రేమ్ లో మెగా-అక్కినేని.. వ్వాటే స్టిల్
దివంగత అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు వేడుక.. ఆ అరుదైన.. అద్భుతమైన సందర్భానికి వేదికగా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
By: Tupaki Desk | 29 Oct 2024 6:42 PM GMTఒకే ఫ్రేమ్ లో నచ్చిన హీరోలంతా కనిపిస్తే.. అభిమానులు ఎంత హ్యాపీగా ఫీలవుతారో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అంత ఖుషీ అయిపోతారు. అదే రెండు సినీ కుటుంబాలకు చెందిన వారసులు.. ఒకే చోట కలిసి సందడి చేస్తే.. ఫోటో దిగితే.. ఆ ఫీలింగే వేరు. దివంగత అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు వేడుక.. ఆ అరుదైన.. అద్భుతమైన సందర్భానికి వేదికగా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి నిన్న అక్కినేని కుటుంబం.. ఏఎన్నార్ జాతీయ అవార్డును అందించిన విషయం తెలిసిందే. 2024కి గాను ఆ పురస్కారం చిరంజీవికి దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆ అవార్డును చిరుకు ప్రదానం చేశారు. ఆ కార్యక్రమానికి అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాజరై సందడి చేశారు. ఆ సమయంలో అక్కినేని కొత్త కోడలు శోభితను చిరుకు పరిచయం చేశారు నాగార్జున.
అదే సమయంలో వేడుకకు మెగా కుటుంబం నుంచి చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనా దేవి, కుమారుడు రామ్ చరణ్, కుమార్తె సుస్మిత సహా పలువురు హాజరయ్యారు. అలా మెగా, అక్కినేని కుటుంబాలకు చెందిన అనేక మంది సభ్యులు కార్యక్రమానికి వచ్చారు. అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పుడు బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా, అక్కినేని హీరోలు కలిసి దిగిన గ్రూప్ పిక్ తో పాటు చిరు, నాగ్ ఫోటో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, నాగచైతన్య, అఖిల్ కలిసి తీసుకున్న ఫోటో అయితే వేరే లెవెల్ లో ఉంది. అంతా బ్లాక్ కలర్ సూట్స్ లో అదరగొట్టారు. మెగాస్టార్, కింగ్ పిక్ అయితే సూపర్ అనే చెప్పాలి. ఆరు పదుల వయసులో ఉన్నా.. ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నారు.
ఇప్పుడు రెండు పిక్స్.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏఎన్నార్ అవార్డు వేడుక.. ఎన్నో అద్భుతమైన క్షణాలకు వేదికగా నిలిచిందని కొనియాడుతున్నారు. లైకులు కొడుతూ సందడి చేస్తున్నారు. ఆ పిక్స్ ను షేర్ చేస్తున్నారు. ఎప్పటికీ మర్చిపోలేని కార్యక్రమమని చెబుతున్నారు. మరి మీరు ఆ రెండు అడోరబుల్ పిక్చర్స్ ను చూశారా?