Begin typing your search above and press return to search.

మెగా హీరోల రెండు సినిమాలు.. క్లారిటీ వచ్చేదెప్పుడో?

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 April 2025 6:14 AM
మెగా హీరోల రెండు సినిమాలు.. క్లారిటీ వచ్చేదెప్పుడో?
X

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. షూటింగ్స్ లో పాల్గొంటూ మూవీస్ ను కంప్లీట్ చేస్తున్నారు. థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తమ అభిమాన హీరోల చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు బడా హీరోల రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదని చెప్పాలి. ఇప్పటికే ఆ సినిమాల రిలీజ్ వాయిదా పడినా.. కొత్త విడుదల తేదీలపై మాత్రం అందరిలో సందిగ్ధత నెలకొంది. అవే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాలు.

వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర.. మూవీ నిజానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వేసవికి వాయిదా పడింది. దీంతో టాలీవుడ్ లక్కీ డేట్ మే 9వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని అంచనా వేశారు. రీసెంట్ గా ప్రకటన కూడా వస్తుందని అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం చిరు తన అప్ కమింగ్ మూవీతో బిజీ అయిపోయారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కానీ విశ్వంభర రిలీజ్ పై క్లారిటీ లేదు. డిజిటల్ రైట్స్ డీల్ సెట్ అయ్యాకే మూవీ విడుదల తేదీ కన్ఫర్మ్ అవుతుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, హరిహర వీరమల్లు మూవీ స్టార్ట్ అయ్యి చాలా ఏళ్లు అవుతుంది. పలు కారణాల వల్ల సినిమా బాగా లేట్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. ఆంధ్ర రాజకీయాల్లో బిజీగా మారడంతో మూవీ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా కొద్ది రోజుల క్రితం షూటింగ్ రీస్టార్ట్ అయింది. శరవేగంగా చిత్రీకరణను చేశారు మేకర్స్.

కానీ పూర్తి చేయడానికి మరో 12 రోజుల పాటు పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉందట. అయితే నిజానికి హరిహర వీరమల్లు.. మార్చి 28న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మే9కి వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు ఆ డేట్ న కూడా సినిమా రిలీజ్ అవ్వదేమోనని అంతా అనుమానపడుతున్నారు. మళ్లీ వాయిదా పడుతుందని అంటున్నారు.

మే 9న నితిన్ తమ్ముడు, శ్రీ విష్ణు సింగిల్, బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో హరిహర వీరమల్లు.. మే నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి విశ్వంభర, హరిహర వీరమల్లు చిత్రాల రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేనట్లే. మరేం జరుగుతుందో వేచి చూడాలి.