గేమ్ ఛేంజర్ పై మెగాస్టార్ సంచలన ప్రకటన!
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు ఇది చిరంజీవి మాటగా చెప్పారంటూ ఏకంగా సంచలన ప్రకటనే చేసారు.
By: Tupaki Desk | 30 Dec 2024 7:08 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' భారీ అంచనాల మధ్య జనవరి 10న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాని ఓ రేంజ్ లో ఎక్కిస్తున్నారు. పక్కా కమర్శియల్ చిత్రం నెక్స్ట్ లెవల్ రామ్ చరణ్ ని చూస్తారంటూ శంకర్ ధీమా వ్యక్తం చేసారు. ఇక సుకుమార్ అయితే ఏకంగా జాతీయ అవార్డు వస్తుందని అమెరికా వేదికగా ఉద్ఘాటించారు. రైటర్ సాయిమాధవ్ బుర్రా. టాలీవుడ్ లో ఓ గొప్ప చిత్రమవుతుందని ధీమా వ్యక్తం చేసారు.
భారతీయుడు, జెంటిల్ మెన్ తరహా కమర్శియల్ సినిమా అని చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ గడియలు ఎప్పుడెప్పుడా అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత దిల్ రాజు ఇది చిరంజీవి మాటగా చెప్పారంటూ ఏకంగా సంచలన ప్రకటనే చేసారు. సినిమాలో రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూస్తారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో ఏపీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తాం.
దీనికి సంబంధించి త్వరలోనే పవన్ కళ్యాణ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చిరంజీవిగారు సినిమా చూసారు. హిట్ ఖాయమని నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇదే మాట మీకు చెప్పమని ఫోన్ లో నాకు చెప్పారు` అని అన్నారు. ఈ మాట ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నేరుగా చిరంజీవే చెప్పినంత బలంగా దిల్ రాజు చెప్పడంతో? ఇక అంచనాలు ఇంకే స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం ఇదే డిస్కషన్ అన్ని చోట్లా జరుగుతోంది. విజయవాడలో రామ్ చరణ్ లుంగీ ..బనియన్ భారీ కటౌట్ నెట్టింట వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆ కటౌట్ ని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు అభిమానులు తరలి వస్తున్నారు.