Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్స్ తో చిరంజీవి!

బాలీవుడ్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితులు ఎవ‌రు అంటే? స‌ల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది. ఆ త‌ర్వాత అమీర్ ఖాన్ పేరు చెబుతారు.

By:  Tupaki Desk   |   22 Feb 2025 9:30 PM GMT
బాలీవుడ్ స్టార్స్ తో చిరంజీవి!
X

బాలీవుడ్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితులు ఎవ‌రు అంటే? స‌ల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తుంది. ఆ త‌ర్వాత అమీర్ ఖాన్ పేరు చెబుతారు. ఆ స్నేహంతోనే గాడ్ ఫాద‌ర్ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ చిరంజీవి కోసం గెస్ట్ రోల్ పోషించారు. అందుకు గానూ ఒక్క రూపాయి పారితోషికం కూడా స‌ల్మాన్ తీసుకోలేదు.

రెమ్యున‌రేష‌న్ గురించి చిరంజీవి స‌న్నిహితులు ఫోన్ చేస్తే ఏకంగా వాళ్ల‌నే ఫోన్ పెట్ట‌మ‌ని తిట్టేసి పెట్టేసిన న‌టుడు స‌ల్మాన్. అంతగా చిరంజీవితో స‌ల్మాన్ బాండింగ్ ముడిప‌డి ఉంది. 'గాడ్ ఫాద‌ర్' తోనే తెలుగు లో స‌ల్మాన్ ఎంట్రీ జ‌రిగిపోయింది. ఇక అమీర్ ఖాన్ -చిరంజీవి బాండింగ్ అంతే ప్ర‌త్యేక‌మైన‌ది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్లు ఉన్నా?..అమితాబ‌చ్చ‌న్ లాంటి వారు ఉన్నా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును చిరంజీవి.. ..అమీర్ చేతుల మీదుగా అందుకున్నారు.

చిరంజీవి ఒక్క ఫోన్ కాల్ చేయ‌గానే అప్ప‌టిక‌ప్పుడు ఆగ‌మేగాలుగా హైద‌రాబాద్ లో ల్యాండ్ అయ్యారు అమీర్. అదీ చిరంజీవి-అమీర్ మ‌ధ్య బాండింగ్. అలాంటి ఈ ముగ్గురు క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుంది? అది అద్భుత‌మే క‌దా. ఆ త్ర‌యాన్ని తెర‌పై చూడ‌టానికి వెయ్యి క‌ళ్లైనా స‌రిపోవేమో క‌దా. అవును మెగా అభిమానులు కోరుకుటున్నది ఇదే.

చిరు-స‌ల్మాన్-అమీర్ భాయ్ ల‌ను ఒకే ప్రేమ్ లో చూడాలంటూ మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అది జ‌ర‌గాలంటే ముగ్గురు ఇమేజ్ కి తగ్గ మంచి స్టోరీ కావాలి. అలాంటి స్టోరీ కుదిరిననాడు? చిరంజీవి పిలిస్తే వాళ్లిద్ద‌రు ముంబై నుంచి రాక‌పోతారా? తెలుగు సినిమా చేయ‌క‌పోతారా? నో చెప్ప‌డానికి అవ‌కాశ‌మే ఉండ‌దు.