ఎవరు ఈ సంక్రాంతి బుల్లోడు? చిరంజీవి లా ఫోజ్ కొడుతున్నాడు!
అవును.. ఎవరు ఈ కుర్రోడు చిరంజీవిలా ఫోజ్ కొడుతున్నాడు? చూడచక్కని పండగ దుస్తుల్లో సక్కంగ ఫోజులిచ్చాడు!
By: Tupaki Desk | 14 Jan 2025 12:46 PM GMTఅవును.. ఎవరు ఈ కుర్రోడు చిరంజీవిలా ఫోజ్ కొడుతున్నాడు? చూడచక్కని పండగ దుస్తుల్లో సక్కంగ ఫోజులిచ్చాడు! ఊరూ వాడా ఉన్న కన్నెలంతా ఈ బుల్లోడి దివ్యమైన రూపం గురించే మాట్లాడుకునేంతగా సుందరుడిలా ఉన్నాడు!
చూస్తుంటే చిరంజీవిలాగే ఉన్నాడు... కాదు.. కాదు.. చిరంజీవే. స్వయంగా ఇన్ స్టాలో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఈ స్పెషల్ పండగ లుక్ ని షేర్ చేసాడు. చూడగానే రామ్ చరణ్ కంటే యంగ్ గా కనిపిస్తుంటే, అందరూ ఒకటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాస్ ఏజ్ అంతకంతకు తగ్గిపోతుంటే ఫ్యాన్స్ కూడా గుర్తు పట్టలేకపోతున్నారు. ఎవరో ఈ కుర్రాడు! అంటూ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే సంక్రాంతి అల్లుడులా ఉన్నాడు చిరు. అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్లు రోజుల్లోకి లాక్కెళ్లాడు బాసు.
రాబోవు సినిమా `విశ్వంభర`లో ఇంతే యంగ్ గా కనిపిస్తాడా ఏమో! కానీ చిరంజీవి మెగా మేకోవర్ నిజంగా సర్ ప్రైజ్ చేస్తోంది. విశ్వంభర తర్వాత కూడా క్షణం తీరిక లేనంతగా సినిమాలతో బిజీగా మారుతున్నారు బాసు. అదే సమయంలో తన గ్లామర్ ని కించిత్ కూడా తగ్గనీకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. దీనికోసం నిరంతరం జిమ్, యోగా, మెడిటేషన్ అంటూ క్రమశిక్షణతో జీవిస్తున్నారు. మంచి ఆహార నియమాలు, నిద్ర వంటివి పాటిస్తున్నాడు. బాస్ క్రమశిక్షణ నేటితరం హీరోలకూ స్ఫూర్తి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్.. అంటూ ఈ ఫోటోని ఇలా మెగాస్టార్ షేర్ చేయగానే, తన ఫేవరెట్ గురించి వెంటనే రెస్పాండ్ అయింది యాంకర్ శ్రీముఖి. Bosssssssss అంటూ ఫైర్ లవ్ ఈమోజీలను షేర్ చేసింది. శ్రీముఖి ఇంతకుముందు మెగా బాస్ నటించిన భోళా శంకర్ లో నటించిన సంగతి తెలిసిందే.