Begin typing your search above and press return to search.

సంక్రాంతి హీరోలతో మెగా సర్ ప్రైజ్.. సెట్టయితే కిక్కే కిక్కు..

మెగాస్టార్ చిరంజీవి ఈ ముగ్గురు హీరోలతో ప్రత్యేక ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 Jan 2025 8:42 AM GMT
సంక్రాంతి హీరోలతో మెగా సర్ ప్రైజ్.. సెట్టయితే కిక్కే కిక్కు..
X

సంక్రాంతి సమయంలో మూడు పెద్ద చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. జనవరి 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో, జనవరి 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ తో, జనవరి 14న విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఈ మూడు సినిమాలు ఇప్పటికే భారీ అంచనాలు సొంతం చేసుకుని, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల కోసం సిద్ధంగా ఉన్నాయి.

వివిధ జోనర్లలో రాబోతున్న ఈ సినిమాలు ప్రేక్షకుల రుచులకు తగినవిగా ఉంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్లు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. గేమ్ చేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్లు సైతం పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేయబడ్డాయి. ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డాకు మహారాజ్ కూడా మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా తన ప్రమోషన్లను నడిపిస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని హిలేరియస్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూడు సినిమాల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫ్యాన్స్ మధ్య కూడా క్యూరియసిటీ కూడా గట్టిగానే క్రియేట్ అవుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఈ ముగ్గురు హీరోలతో ప్రత్యేక ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ కోసం ఇది సంక్రాంతి బిగ్ ట్రీట్ గా ఉండబోతోందట. బాలయ్య, చరణ్, వెంకీతో కలిసి చిరంజీవి సరదాగా సంభాషించడం చూస్తే అభిమానులు ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతారని చెప్పవచ్చు. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ ఇప్పటికే రామ్ చరణ్, వెంకటేశ్‌లతో చేసిన సందడి మంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు చిరు ఇంటర్వ్యూ కూడా సెట్టయితే కిక్కే కిక్కు అని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కన్ఫర్మ్ అయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అనే ఆసక్తి సినీ ప్రేమికులలో రాకుండా ఉండదు.

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి నటీనటుల సినీ ప్రయాణం, వారి ప్రాజెక్టుల పట్ల అభిప్రాయాలను పంచుకుంటారని సమాచారం. సినీ ఇండస్ట్రీలో పెద్దలు, యువ హీరోల మధ్య ఇలాంటి కట్టుదిట్టమైన అనుబంధాలు తెలుగు సినిమాకు మరింత గౌరవాన్ని తీసుకొస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. సంక్రాంతి వేడుకల్లో మెగాస్టార్ సందడి ఉంటే ఫ్యాన్స్‌కు ఒక అదనపు పండగ అనే చెప్పాలి. పెద్ద సినిమాల విడుదల, వేరువేరు జోనర్ల కలయిక సంక్రాంతి థియేటర్లకు కాసుల వర్షాన్ని తెస్తుందని భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎవరి సినిమా ఎంతమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.