చిరంజీవి నమ్మాడంటే మాత్రం..!
నాని కథల ఎంపిక బాగుంటుంది. అందుకే నాని రిఫర్ చేశాడు అనేది ఒక ప్లస్ పాయింట్ కాగా చిరుని మళ్లీ ఆయన వింటేజ్ ఇమేజ్ గుర్తు చేసేలా శ్రీకాంత్ కథ రాసుకున్నాడట.
By: Tupaki Desk | 29 Dec 2024 4:31 AM GMT150కి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు తన కథతో మెప్పించాడు అంటే అది మామూలు విషయం కాదు. అసలే తను చేసే సినిమాల విషయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా కేర్ తీసుకుంటారు. కథా చర్చల్లో ఆయన అనుభవాన్ని కూడా పెట్టి బాగా డెవలప్ అయ్యేలా చేస్తారని చెబుతుంటారు. ఐతే కొన్నిసార్లు చిరు ఇచ్చిన ఇన్ పుట్స్ సినిమాను రాంగ్ రూట్ లో తీసుకెళ్తాయన్న టాక్ కూడా ఉంది. ఐతే ఆయన అనుభవం సినిమాకు మంచి చేస్తుంది కానీ అలా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండదు.
చిరంజీవి కథల ఎంపికే ఆయన్ను మాములు హీరో నుంచి మెగాస్టార్ ని చేసింది. ఐతే ఒక సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఓదెలతో చిరు సినిమా మెగా ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇచ్చింది. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ తో చిరంజీవి సినిమా తీయడం ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇస్తుంది. ఐతే చిరుని కథతో ఒప్పించడం అంత తేలికైన విషయం కాదు. కానీ శ్రీకాంత్ అసలు ఎలా ఒప్పించాడు అన్నది కొందరి డౌట్.
నానితో దసరా సినిమా తీసి డైరెక్టర్ గా తన పర్ఫెక్షన్, క్లారిటీ ఏంటో చూపించిన శ్రీకాంత్ ఓదెల నానితోనే రెండో సినిమా చేస్తున్నాడు. పారడైస్ అంటూ ఒక సినిమాతో హిట్ కాంబో రాబోతుంది. ఐతే ఈ సినిమా ప్రయత్నంలోనే చిరు కోసం కథ సిద్ధం చేయగా నాని సపోర్ట్ తోనే ఆయన ద్వారానే చిరంజీవిని కలిసి కథ వినిపించారట. సో చిరు నమ్మడానికి ముందు నాని ఈ కథ నమ్మాడు. ఆ తర్వాత చిరంజీవి దగ్గరకు వెళ్లింది.
నాని కథల ఎంపిక బాగుంటుంది. అందుకే నాని రిఫర్ చేశాడు అనేది ఒక ప్లస్ పాయింట్ కాగా చిరుని మళ్లీ ఆయన వింటేజ్ ఇమేజ్ గుర్తు చేసేలా శ్రీకాంత్ కథ రాసుకున్నాడట. అందుకే చిరంజీవి ఒక సిట్టింగ్ లోనే ఈ కథ ఓకే చేశాడని అంటున్నారు. చిరంజీవి నమ్మాడంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది. చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమా ఒక పీరియాడికల్ మూవీ అని తెలుస్తుంది. నానితో శ్రీకాంత్ పారడైస్ ఒక వైపు.. చిరంజీవి విశ్వంభర మరో వైపు ఈ సినిమాలు పూర్తైతే నెక్స్ట్ ఈ సినిమాకు షిఫ్ట్ అవుతారని తెలుస్తుంది.