Begin typing your search above and press return to search.

ఓదెలతో చిరంజీవి పీరియడ్ యాక్షన్ డ్రామా..!

ఇదిలా ఉంటే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల కాంబోలో మోస్ట్ వైలెంట్ మూవీ రానుందని మేకర్స్ తెలిపారు.

By:  Tupaki Desk   |   28 Dec 2024 10:55 AM GMT
ఓదెలతో చిరంజీవి పీరియడ్ యాక్షన్ డ్రామా..!
X

మెగాస్టార్ చిరంజీవి, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అప్పటి నుంచి రోజూ ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఏదొక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. మెగా మూవీలో హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండే అవకాశం లేదని రూమర్స్ వచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా 'ది ప్యారడైజ్' అనే సినిమాని తెరకెక్కున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ చేయబోతున్న మెగా మూవీకి కూడా ఆయనే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధాకర్.. ఇవి రెండూ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే యాక్షన్ సినిమాలనే విషయాన్ని వెల్లడించారు.

చిరంజీవి సినిమాలో పాటలు ఏమీ లేకుండా యునిక్ గా తీస్తున్నారట కదా? అని ప్రశ్నించగా.. "అదంతా జస్ట్ సోషల్ మీడియాలో జనాలు అనుకుంటున్నదే కానీ.. ఇంకా కథే రెడీ అవ్వలేదు" అని సుధాకర్ సమాధానమిచ్చారు. ఇక ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని, పెద్ద సినిమాటోగ్రాఫర్ ను తీసుకోవాలని మెగా అభిమానుల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. దీనిపై నిర్మాత స్పందిస్తూ.. "లేదండీ, ఆల్రెడీ డీఓపీ & మ్యూజిక్ డైరెక్టర్‌ ఫిక్స్ అయిపోయారు" అని అన్నారు. అయితే అనిరుధ్ ను ఫైనలైజ్ చేశారా? లేదా? అనేది ఇంకా క్లారిటీ రావడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల కాంబోలో మోస్ట్ వైలెంట్ మూవీ రానుందని మేకర్స్ తెలిపారు. #ChiranjeeviOdela, #ChiruOdelaCinema అనే హ్యాష్ ట్యాగ్స్ తో ప్రీలుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. "అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు'' అనే క్యాప్షన్ తో, బ్యాగ్రౌండ్ లో రక్తంతో తడిసిన చేతితో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. మెగాస్టార్ మ్యాడ్ నెస్ ని చూడబోతున్నారంటూ అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు పెంచేశారు.

నాని హీరోగా నటించిన 'దసరా' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల.. డెబ్యూతోనే 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నానీతోనే తన రెండో సినిమా 'ప్యారడైజ్' చేస్తున్నాడు. ఇది సెట్స్ మీద వుండగానే చిరంజీవితో మూవీ ప్రకటించిన అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ క్రేజీ ప్రాజెక్టును యునానిమస్ బ్యానర్ మీద నాని సమర్పిస్తుందటం మరో విశేషం. అనౌన్స్ మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చిరు-శ్రీకాంత్ ఓదెల' సినిమా.. వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. ఆలోపు చిరంజీవి 'విశ్వంభర' సినిమా పనులు పూర్తి చేయనున్నారు. 2025 సమ్మర్ లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రిలీజ్ కానుంది.