చిరు సాబ్.. ఏజ్ పెరుగుతుందా? తగ్గుతుందా?
బ్లాక్ గూగుల్స్ పెట్టుకున్న మెగాస్టార్.. వేరే లెవెల్ లో ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి.. కొత్త పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. బాస్ అదరగొట్టేశారని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
By: Tupaki Desk | 25 Dec 2024 2:46 PM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో అవార్డులు.. మరెన్నో ఘనతలు.. ఇంకెన్నో రివార్డులతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన యాక్టింగ్, వేరే లెవెల్ డ్యాన్స్ తో ఒక బ్రాండ్ గా ఎదిగిన ఆయన.. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తూ దూసుకుపోతున్నారు.
ఆరు పదుల వయసులో కూడా ఇంకా కుర్రాడిలాగే కనిపిస్తుంటారు చిరు. ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ తో సందడి చేస్తుంటారు. తన యంగ్ లుక్స్ తో ఆకట్టుకునే చిరు లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సింపుల్ అండ్ మోడ్రన్ డ్రెస్ వేసుకున్న ఆయన.. గార్డెన్ లో కిర్రాక్ పొజులు ఇచ్చారు.
బ్లాక్ గూగుల్స్ పెట్టుకున్న మెగాస్టార్.. వేరే లెవెల్ లో ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి.. కొత్త పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. బాస్ అదరగొట్టేశారని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వయసు పెరుగుతుందో.. తగ్గుతుందో అర్థం కావడం లేదని అంటున్నారు. సింపుల్ సూపర్బ్ అని చెబుతున్నారు. యంగ్ జనరేషన్ కు ఆయన అన్ని విషయాల్లోనూ ఇన్స్పిరేషన్ అని అంటున్నారు.
ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి సంక్రాంతికి సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడింది.
ప్రస్తుతం విశ్వంభరను పూర్తి చేసే పనిలో ఉన్న చిరు.. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ప్రాజెక్టు సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారట. నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. మరికొద్ది నెలల్లో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. నెవ్వర్ బిఫోర్ మాస్ రోల్ లో చిరును శ్రీకాంత్ చూపించనున్నారు!
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా చిరంజీవి వర్క్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఆ మూవీలో చిరు రోల్ కొత్తగా ఉంటుందని వినికిడి. అదే సమయంలో కోలీవుడ్ డైరెక్టర్ మిత్రన్ తో కూడా చిరు వర్క్ చేయనున్నట్లు టాక్. మరి అప్ కమింగ్ సినిమాలతో మెగాస్టార్ ఎలా మెప్పిస్తారో చూడాలి.